Nagarjuna : అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున.. ఈ యేడాది కొత్త దర్శకుడు సాల్మన్ డైరెక్షన్‌లో ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కినా.. కలెక్షన్స్ మాత్రం దక్కలేదు. మరోవైపు ఓటీటీలో ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో ఇరగదీసారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు వేసింది.
తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ బుధవారం నుంచి మొదలు కానుంది. ఇటీవలె గోవాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి నిర్మిస్తున్నారు.
King? @iamnagarjuna & @PraveenSattaru's High-octane Action Thriller!?
Second schedule commences on 4th August in Hyderabad!?
Key sequences will be picturised!?#KingNagsNext @MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial pic.twitter.com/P2a26POJ6P
— BARaju's Team (@baraju_SuperHit) August 2, 2021
ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్ నటిస్తోంది. మరోవైపు జబర్ధస్త్ భామ రష్మి గౌతమ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
ఇక నాగార్జున నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం సినిమాతో పాటు ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా సీక్వెల్ ‘బంగార్రాజు’ సినిమా ఈ నెల 20న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మరోసారి తనయుడు నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న నాగార్జున. మొత్తంగా నాగార్జున వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kajal Aggarwal, Nagarjuna Akkineni, Praveen Sattaru, Tollywood