Nagarjuna As Ghost : ఈ రోజు నాగార్జున (Nagarjuna) బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు ’ ది ఘోస్ట్’ (The Ghost) అనే టైటిల్ ఖరారు చేసారు,. ఈ యేడాది నాగార్జున.. కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ (Wild Dog)మూవీతో పలకరించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రవీణ్ సత్తారు మూవీలో నాగార్జున .. ‘రా’ ఏజెంట్ పాత్రలో అలరించనున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా విడుదల చేసిన లుక్‌లో నాగార్జున వర్షంలో కత్తి పట్టుకుని ఉన్నారు. ఎదురుగా విలన్స్‌ను చూపించారు. మొత్తంగా ప్రవీణ్ సత్తారు.. నాగార్జునతో సాలిడ్ యాక్షన్ ఎంటర్టేనర్ తెరక్కిస్తున్నట్టు అర్ధం అవుతోంది. శతృవులను ఘోస్ట్ రూపంలో అంతమొందించే పాత్రలో నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌ను చూస్తే అర్ధమవుతోంది. అంతేకాదు పేరు కోసమే కాదు.. ఎంతో మంది దేశం కోసం అజ్ఞాతంగా పనిచేస్తున్నారు. వారందరినీ ఉద్దేశించి ‘ఘోస్ట్’ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది.
Here’s the Stri- ???? ⚡️Title & Stunning First Look of@iamnagarjuna’s #TheGHOST?#GhostFirstLook ?#HBDKingNagarjuna @PraveenSattaru @MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial pic.twitter.com/tqxfUiNrOO
— BA Raju's Team (@baraju_SuperHit) August 29, 2021
‘ది ఘోస్ట్’ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా (Kajal Aggerwal) నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. కథలో భాగంగా మన దేశంలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం.
ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్ నటిస్తున్నారు.
నాగార్జున ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈయన నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’ 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ సీక్వెల్‌లో హిందీ నటి సోనాక్షి సిన్హా నటించనుందట. షూటింగ్ శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందట.ఈ చిత్రంలో నాగ చైతన్యతో పాటు అఖిల్ కూడా నటించనున్నారు.
‘బంగార్రాజు’, ‘ఘోస్ట్’ సినిమాలతో పాటు నాగ్.. ‘బ్రహ్మాస్త్ర’ అనే ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nagarjuna Akkineni, Praveen Sattaru, The Ghost Movie, Tollywood