NAGARJUNA AS BANGARRAJU LOOK RELEASED BY NAGA CHAITANYA AKKINENI SEE PICS TA
Nagarjuna As Bangarraju : నాగార్జున ‘బంగార్రాజు’ ఫస్ట్ లుక్ అదుర్స్.. విడుదల చేసిన నాగ చైతన్య..
నాగార్జున ‘బంగార్రాజు’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
Nagarjuna: అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’(Bangarraju). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున లుక్‌ను చైతూ విడుదల చేసారు.
Nagarjuna: అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’(Bangarraju). సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో మరో హీరోగా నాగార్జున తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) కూడా నటిస్తున్నారు. ఈ రోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఇప్పటికే ప్రవీణ్ సత్తారు మూవీ నుంచి ‘ది ఘోస్ట్’ అంటూ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేసారు. తాజాగా నాగ చైతన్య తండ్రి నాగ్ బర్త్ డే సందర్భంగా ‘బంగర్రాజు’ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ లుక్ చూస్తుంటే.. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో చూసినా.. ‘బంగార్రాజు’ లుక్‌లో అదిరిపోయింది. అంతేకాదు ‘ది డెవిల్ ఈజ్ బ్యాక్’ అనేది క్యాప్షన్. దీంతో పాటు నాగ చైతన్య తన తండ్రితో కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ లుక్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందని ద్రాక్షనే అయింది. అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు ప్రీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.
Thank you ra chai!!Really looking forward to working with you again 😀It’s going to be a lot of fun👍👍👍 https://t.co/hOGyVAD7z3
రీసెంట్గా ‘బంగార్రాజు’ సినిమాను నాగార్జున పూజా కార్యక్రమాలతో ప్రారంభించడంతో పాటు షూటింగ్ మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమ ా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. ఇప్పటికే నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మనం తర్వాత వీళ్లిద్దరు కలిసి ఈ సినిమా నటిస్తుండంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ‘రాధే శ్యామ్’, పవన్, రానా మూవీతో పాటు, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ సినిమాలున్నాయి. ఇపుడు నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ కూడా విడుదలకు ఉరకలు వేస్తున్నట్టు తెలుస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.