• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGARJUNA AND PRAVEEN SATTARU READY FOR SECOND SCHEDULE FROM JUNE FIRST WEEK HERE ARE THE DETAILS SR

Nagarjuna Akkineni : రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోన్న నాగార్జున ప్రవీణ్ సత్తారు..

Nagarjuna Akkineni : రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోన్న నాగార్జున ప్రవీణ్ సత్తారు..

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున (Twitter/Photo)

Nagarjuna Akkineni : అక్కినేని నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

  • Share this:
    అక్కినేని నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓ షెడ్యూల్‌ను కూడా ముగించుకుంది. ఇక రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ‌లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను జూన్ మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నాడట. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌ నటిస్తోంది.

    ఇక అక్కినేని నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ అనే సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. వైల్డ్ డాగ్’  సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంతో  అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో అక్కినేని నాగార్జున అదరగొట్టారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఆయన నటించన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’ 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సీక్వెల్‌లో హిందీ నటి సోనాక్షి సిన్హా నటించనుందట. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.  అయితే ఎప్పుడో ఈ సినిమా గురించి ప్రకటించగా.. ఇన్నాళ్లు స్క్రిప్టులో పలు మార్పులు చేసి ఫైనల్‌గా ఓకే అయ్యింది. దీంతో ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నుండి ప్రారంభం కానుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందట.

    ఇక నాగార్జున నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియా భట్‌ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: