హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna Akkineni : అదిరిన నాగార్జున ప్రవీణ్ సత్తారు మూవీ ప్రీ లుక్.. హాలీవుడ్ స్థాయిలో..

Nagarjuna Akkineni : అదిరిన నాగార్జున ప్రవీణ్ సత్తారు మూవీ ప్రీ లుక్.. హాలీవుడ్ స్థాయిలో..

Nagarjuna Photo : Twitter

Nagarjuna Photo : Twitter

Nagarjuna Akkineni : అక్కినేని నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అక్కినేని నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రవీణ్ సత్తారు( Nagarjuna and Praveen sattaru movie) దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంత కాలం షూటింగ్ జరుపుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అది అలా ఉంటే ఈ చిత్రం నుంచి ఒక మాస్ అనౌన్సమెంట్, ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ లుక్ ఆసక్తికరంగా ఉంది. వర్షంలో కత్తిని పట్టుకొని ఉన్న నాగ్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఇక నాగార్జున బర్త్ డే సందర్భంగా 29వ తారీఖున మరో సాలిడ్ అప్డేట్ ఉండనున్నట్టుగా తెలిపారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా (Kajal Aggerwal) నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. కథలో భాగంగా ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌ నటిస్తున్నారు.

ఇక ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’ 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ సీక్వెల్‌లో హిందీ నటి సోనాక్షి సిన్హా నటించనుందట. షూటింగ్ శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందట.

ఇక నాగార్జున నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియా భట్‌ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

First published:

Tags: Nagarjuna Akkineni, Tollywood news

ఉత్తమ కథలు