Home /News /movies /

NAGARJUNA ALIA BHATT RANBIR KAPOOR BRAHMASTRA PUBLICITY PLANNINGS TA

Brahmastra: ఆర్ఆర్ఆర్ తరహాలో ’బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం డిఫరెంట్ ప్రమోషన్ ప్లాన్స్..

రణ్‌బీర్ కపూర్,ఆలియా భట్‌, దర్శకుడు అయాన్ ముఖర్జీలతో నాగార్జున

రణ్‌బీర్ కపూర్,ఆలియా భట్‌, దర్శకుడు అయాన్ ముఖర్జీలతో నాగార్జున

Brahmastra: ఆర్ఆర్ఆర్ తరహాలో ’బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం డిఫరెంట్ ప్రమోషన్ ప్లాన్స్ చేసారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగ నటిస్తోన్న ఈ చిత్రంలో  బిగ్‌బీ అమితాబ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున మరో డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ఆర్ఆర్ఆర్ తరహాలో ప్రచారం మొదలు పెట్టనున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    Brahmastra: ఆర్ఆర్ఆర్ తరహాలో ’బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం డిఫరెంట్ ప్రమోషన్ ప్లాన్స్ చేసారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగ నటిస్తోన్న ఈ చిత్రంలో  బిగ్‌బీ అమితాబ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆర్కియాలజీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీలో నాగార్జున నటిస్తోన్న చిత్రం ఇదే. టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలీవుడ్లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి, ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవ్వరైనా ఉన్నారంటే అది కచ్చితంగా అక్కినేని నాగార్జుననే.

    తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన ‘శివ’ సినిమా హిందీ రీమేక్ చిత్రంతో 1990లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ్. ఆ తర్వాత ‘ద్రోహి’, ‘ఖుదా గవా’, ‘క్రిమినల్’, ‘జక్మ్’ వంటి హిందీ సినిమాల్లో నటించారు. 2003లో వచ్చిన ‘ఎల్.ఓ.సీ కార్గిల్’ హిందీ సినిమాలో చివరిసారిగా ఓ పాత్రలో నటించారు నాగార్జున. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ తెరపై ఆర్కియాలజీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

    Nagarjuna Alia Bhatt Ranbir Kapoor Brahmastra Publicity Plannings,Brahmastra: ఆర్ఆర్ఆర్ తరహాలో ’బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం డిఫరెంట్ ప్రమోషన్ ప్లాన్స్..,Brahmastra,RRR,RRR Brahmastra,Nagarjuna Alia Bhatt Ranbir Kapoor Brahmastra Publicity Plannings,Brahmastra Teaser,Nagarjuna,Alia Bhatt,Ranbir Kapoor,Brahmastra,Brahmastra Teaser,Brahmastra Publicity,Tollywood,Bollywood,Kollywood,బ్రహ్మాస్త్ర,నాగార్జున బ్రహ్మాస్త్ర,రణ్‌బీర్ కపూర్,ఆలియా భట్,బ్రహ్మాస్త్ర డిఫరెంట్ ప్రమోషన్స్,
    ’బ్రహ్మాస్త్ర’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ, రణ్‌బీర్ కపూర్,ఆలియా భట్‌లతో నాగార్జున (Twitter/Photo)


    2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా ఇతరత్రా సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. కొంచెం ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైయింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను ఆర్ఆర్ఆర్ తరహాలో ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాసల్లో విడుదల చేయనున్నారు. అప్పటికే వివిధ భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసారట. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఉండేవారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వివిధ భాషల్లో 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్స్ విడుదల చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఆయా భాషల్లో టీజర్స్ కట్ చేసి అక్కడ స్థానిక సెన్సార్ సభ్యులు ఓకే చెబితే.. వెంటనే ప్రచారం మొదలు పెట్టనున్నారు. మొత్తంగా రణ్‌బీర్ కపూర్, నాగార్జునలకు ఇదే తొలి ప్యాన్ ఇండియా మూవీ అనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Alia Bhatt, Amitabh bachchan, Bollywood news, Karan Johar, Nagarjuna Akkineni, Ranbir Kapoor, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు