హోమ్ /వార్తలు /సినిమా /

Wild Dog Teaser Promo: టెర్రరిజంపై సంధించిన అస్త్రం ‘వైల్డ్ డాగ్’.. విజయ్ వర్మగా అదరగొట్టిన నాగ్..

Wild Dog Teaser Promo: టెర్రరిజంపై సంధించిన అస్త్రం ‘వైల్డ్ డాగ్’.. విజయ్ వర్మగా అదరగొట్టిన నాగ్..

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ న్యూ టీజర్ ప్రోమో (Twitter/Photo)

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ న్యూ టీజర్ ప్రోమో (Twitter/Photo)

Wild Dog Teaser Promo: నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మరో టీజర్ ప్రోమోను విడుదల చేసారు.

  Wild Dog Teaser Promo: నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే నాగార్జున వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా వైల్డ్ డాగ్ మూవీ నుంచి టీజర్ ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన దేశంలో గతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. కమర్షియల్ పంథా పక్కనబెట్టి పక్కా దేశభక్తి సినిమాను చేసాడు నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో మన దేశంలో 1989లో అప్పటి హోం శాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సైయిద్ కూతురును టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే 19 టెర్రరిస్టులను విడిచిపెట్టారు. 1999లో కాందహార్ ప్లేన్ హైజాక్ చేసినపుడు హఫీజ్ సైయ్యద్ సహా ముగ్గరు టెర్రరిస్టులను విడిచిపెట్టారు. ఆ తర్వాత హఫీజ్ సైయ్యద్.. ముంబాయిలో టెర్రర్ అటాక్ చేయించాడు. ఈ దాడిలో 174 మంది అమాయకులు చనిపోయారు. ఎంతో మంది కాలు చేతులు విరగొట్టుకొని దివ్యాంగులయ్యారు.

  దేశంలో ఎన్నో మారుణ కాండలను చేసిన టెర్రరిస్టులను మనం ఏమి చేయలేం అంటే దానికి నేను ఒకే చెప్పను అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ బాగుంది. ఈ చిత్రంలో విజయ్ వర్మగా నాగార్జున డీల్ చేసిన కేసులో ఎవరు మిగలలేదు అనే డైలాగ్ బాగుంది. టెర్రరిస్టులను పట్టుకోని వాడికి బిర్యానీలను మేపడం లాంటివి చేయకూడదనే డైలాగులు ఆలోచింపచేసేలా ఉన్నాయి. మొత్తంగా టెర్రరిస్ట్‌ల కోసమే దేశంలో 29 కోట్ల మంది పోలీసులు, సైనికులు సహా ఎంతో మంది కాపలా కాస్తున్నట్టు చూపించారు ఈ టీజర్ ప్రోమోలో.

  ‘వైల్డ్ డాగ్‌’లో నాగార్జున (Twitter/Photo)

  వైల్డ్ డాగ్ సినిమాలో  విజువల్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సులు బాగున్నాయి. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(NIA) ఏజెంట్‌ విజయ్‌ వర్మగా నాగార్జున అదరగొట్టాడు. కొందరు సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులతో విజయ్ వర్మ చేసే పోరాటమే వైల్డ్ డాగ్ సినిమా. డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ని అంత ముద్దుగా వైల్డ్ డాగ్ అంటారు. అందుకే టైటిల్ కూడా అదే అయిపోయింది. ముందు ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయాలని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. కానీ థియేటర్స్ ఓపెన్ కావడంతో మనసు మార్చుకున్నారు నిర్మాతలు. మరి ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమాతో నాగార్జున బాక్సాఫీస్ దగ్గర నిజంగా వైల్డ్ డాగ్‌గా బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nagarjuna Akkineni, Tollywood, Wild Dog Movie

  ఉత్తమ కథలు