కరోనా వైరస్ ఎఫెక్ట్.. టాలీవుడ్ అగ్ర హీరో సినిమా షూటింగ్ వాయిదా..

ప్రతీతాత్మక చిత్రం

గతేడాది ‘మన్మథుడు 2’ తో సరైన సక్సెస్ అందుకోని నాగార్జున.. ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వ్ంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

 • Share this:
  గతేడాది ‘మన్మథుడు 2’ తో సరైన సక్సెస్ అందుకోని నాగార్జున.. ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వ్ంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు. ఇక కరోనా వైరస్ వైరస్ ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది. అక్కడ కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు సమాచారం. కరోనా వైరస్ తీవ్రత తగ్గేవరకు చిత్ర బృందం థాయ్‌లాండ్ వెళ్లవద్దని నిర్ణయం తీసుకుంది. చిత్ర యూనిట్ ప్రస్తుతానికి థాయ్‌లాండ్ షెడ్యూల్ కాకుండా మిగతా ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.

  Nagarjuna akkineni wild dog movie shooting break due to coronavirus,nagarjuna,nagarjuna coronavirus,nagarjuna wild dog shooting cancelled due to coronavirus,nagarjuna twitter,nagarjuna soloman,nagarjuna new movie soloman,nagarjuna wild dog movie,nagarjuna NIA Officer,nagarjuna wild dog movie,nagarjuna new movie wild dog teaser,nagarjuna wild dog trailer,nagarjuna new movie,nagarjuna,nagarjuna new movie teaser,nagarjuna movies,nagarjuna new movie updates,wild dog trailer,nagarjuna movie,actor nagarjuna telugu movies,nagarjuna new teaser,telugu cinema,నాగార్జున,నాగార్జున అక్కినేని,నాగార్జున వైల్డ్ డాగ్,తెలుగు సినిమా,కరోనా వైరస్,వైల్డ్ డాగ్ కరోనా
  నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ వాయిదా (Twitter/Photo)


  గతంలో నాగార్జున ‘గగనం’ సినిమాలో ఈ తరహా పాత్రలోనే నటించాడు. ఆ తర్వాత నిన్నేప్రేమిస్తా, LOC వంటి సినిమాల్లో  కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ టీంతో పని చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. 2020లో అభిమానులను అలరించడం ఖాయం అంటున్నాడు ఈ సీనియర్ హీరో.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: