Home /News /movies /

NAGARJUNA AKKINENI WILD DOG MOVIE CENSOR COMPLETED TA

Wild Dog Censor: నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా సెన్సార్ పూర్తి.. ఎలా ఉందంటే..

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సెన్సార్ పూర్తి (Twitter/Photo)

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సెన్సార్ పూర్తి (Twitter/Photo)

Nagarjuna Akkineni Wild Dog Censor : నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.

    Nagarjuna Akkineni Wild Dog Censor : నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ  సినిమా మాత్రం దేశభక్తి నేపథ్యంలో మంచి సందేశాత్మక చిత్రమని కితాబు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే నాగార్జున వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వైల్డ్ డాగ్ సినిమా విషయానికొస్తే..  మన దేశంలో గతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. కమర్షియల్ పంథా పక్కనబెట్టి పక్కా దేశభక్తి సినిమాను చేసాడు నాగార్జున.


    మన దేశంలో 1989లో అప్పటి హోం శాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సైయిద్ కూతురును టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే 19 టెర్రరిస్టులను విడిచిపెట్టారు. 1999లో కాందహార్ ప్లేన్ హైజాక్ చేసినపుడు హఫీజ్ సైయ్యద్ సహా ముగ్గరు టెర్రరిస్టులను విడిచిపెట్టారు. ఆ తర్వాత హఫీజ్ సైయ్యద్.. ముంబాయిలో టెర్రర్ అటాక్ చేయించాడు. ఈ దాడిలో 174 మంది అమాయకులు చనిపోయారు. ఎంతో మంది కాలు చేతులు విరగొట్టుకొని దివ్యాంగులయ్యారు. ముఖ్యంగా గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ బాంబ్ బ్లాస్ట్ వంటి గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

    ‘వైల్డ్ డాగ్‌’లో నాగార్జున (Twitter/Photo)


    వైల్డ్ డాగ్ సినిమాలో  విజువల్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సులు బాగున్నాయి. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(NIA) ఏజెంట్‌ విజయ్‌ వర్మగా నాగార్జున అదరగొట్టాడు. కొందరు సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులతో విజయ్ వర్మ చేసే పోరాటమే వైల్డ్ డాగ్ సినిమా. డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ని అంత ముద్దుగా వైల్డ్ డాగ్ అంటారు. అందుకే టైటిల్ కూడా అదే అయిపోయింది. ముందు ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయాలని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. కానీ థియేటర్స్ ఓపెన్ కావడంతో మనసు మార్చుకున్నారు నిర్మాతలు. మరి ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమాతో నాగార్జున బాక్సాఫీస్ దగ్గర నిజంగా వైల్డ్ డాగ్‌గా బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Nagarjuna Akkineni, Tollywood, Wild Dog Movie

    తదుపరి వార్తలు