Wild Dog Closing Collections: కొత్త దనాన్ని ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఎపుడు ముందుంటాడు. తాజాగా ఈ సినిమా రెండో వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందంటే..
Wild Dog Closing Collections: కొత్త దనాన్ని ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఎపుడు ముందుంటాడు. అంతేకాదు కొత్త దనం ఉన్న కథలతో పాటు దర్శకులను పరిచయం చేయడంతో ఎపుడు ముందుంటాడు నాగార్జున. తనకు స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ఒక్కోసారి కథ నచ్చి ప్రయోగాలు చేస్తుంటాడు నాగార్జున. అలా ఇప్పుడు చేసిన ప్రయోగం వైల్డ్ డాగ్. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ వసూళ్ల విషయంలో మాత్రం చాలా వెనకబడింది.
సెకండ్ వీకెండ్ ముగిసిన తర్వాత వైల్డ్ డాగ్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.53 కోట్ల షేర్ రాబట్టింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సినిమాను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఈ చిత్రానికి సెకండ్ వీకెండ్ పూర్తైయ్యేసరికి ఈ సినిమా థియేట్రికల్ కథ ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఏరియా వైజ్ వసూళ్లను ఇప్పుడు చూద్దాం..
ఏపీ + తెలంగాణ (14 రోజుల టోటల్)- రూ. 3.08 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా-రూ. 15 లక్షలు ఓవర్సీస్- రూ. 30 లక్షలు
వరల్డ్ వైడ్ (టోటల్)- 3.53 కోట్లు
‘వైల్డ్ డాగ్’ చిత్రానికి రూ. 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 10 కోట్ల షేర్ రావాల్సిందే. ఫస్ట్ వీకెండ్ కేవలం 2.79 కోట్ల షేర్ రాబట్టింది. సెకండ్ వీకెండ్ ముగిసేసరికి థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా రూ. 3.53 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడంతో ఈ సినిమాను పూర్తిగా దూరం పెట్టారు ప్రేక్షకులు. ఓటిటిలో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. దాంతో నాగార్జునకు దేవదాస్, ఆఫీసర్, మన్మథుడు 2 తర్వాత మరో ఫ్లాప్ తప్పలేదు. మొత్తంగా అమ్మిన రేటుకు వచ్చిన డబ్బులు తీసుకుంటే.. ఈ సినిమా డబుల్ డిజాస్టర్‌గా అని చెప్పుకోవాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.