హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna Akkineni : టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో అక్కినేని నాగార్జునకు ఈ రోజు వెరీ వెరీ స్పెషల్..

Nagarjuna Akkineni : టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో అక్కినేని నాగార్జునకు ఈ రోజు వెరీ వెరీ స్పెషల్..

నాగార్జున (Twitter/Photo)

నాగార్జున (Twitter/Photo)

Akkineni Nagarjuna | అక్కినేని నాగార్జునకు ఈ రోజు వెరీ స్సెషల్ అనే చెప్పాలి. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం మే 23న నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి నటించిన ‘మనం’ సినిమా విడుదలైంది. ఈ సినిమాతో పాటు నాగార్జునకు మరో స్పెషాలిటీ ఉంది.

ఇంకా చదవండి ...

Nagarjuna Akkineni :  అక్కినేని నాగార్జునకు ఈ రోజు వెరీ స్సెషల్ అనే చెప్పాలి. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం మే 23న నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), కొడుకులు నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్‌ (Akhil) తో కలిసి నటించిన ‘మనం’ (Manam) సినిమా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు చిత్ర సీమలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున సతీమణి అమల (Amala) గెస్ట్ పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ  సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటించిన సమంత(Samantha).. ఆ తర్వాత అక్కినేని ఇంటి కోడలు కావడం యాదృచ్ఛకమనే చెప్పాలి. ఆ తర్వాత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు.  ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘మనం’. అన్నపూర్ణ స్టూడియోస్ (AnnaPurna Studious) బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో విక్రమ్ కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు నటించడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

సరిగ్గా 8 ఏళ్ల క్రితం అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన ‘మనం’ సినిమా విడుదలైతే.. 36 ఏళ్ల క్రితం 23 మే  1986లో వి.మధుసూదన రావు (V.Madhusudan Rao) దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) సినిమాతోనే నాగార్జున హీరోగా పరిచయమయ్యారు.

మనం సినిమాతో పాటు విక్రమ్ మే 23న విడుదలయ్యాయి. (Twitter/Photo)

ఈ రకంగా నాగార్జునకు మే 23వ తేదితో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. మొదటి చిత్రంలో నటనలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు. ఇక నిన్నటికి నిన్న మే 22న నాగార్జున హీరోగా నటించిన ‘అన్నమయ్య’ సినిమా విడుదలై 25 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ రకంగా మే నెల నాగార్జునకు వెరీ స్పెషల్ అనే చెప్పాలి.

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట సహా US బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన మహేష్ బాబు మూవీస్..

నాగార్జున 36 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 100 చిత్రాలకు చేరువలో ఉన్నారు. అంతేకాదు తండ్రి నట వారసుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టి.. కొడుకులు ఇద్దరు హీరోలైనా.. ఇప్పటికీ కొడుకులకు గట్టి పోటీ ఇస్తున్న హీరో ఈ తరంలో నాగార్జున తప్పించి మరొకరు లేరనే చెప్పాలి. ఈ యేడాది నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ యేడాది తెలుగులోనే కాదు.. మన దేశంలోనే తొలి హిట్‌తో మరో రికార్డు నమోదు చేశారు.  మొత్తంగా ఈ రోజు నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఇక నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’ టైటిల్‌తో ఇపుడు కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమా తెరకెక్కడం విశేషం.

First published:

Tags: Nagarjuna Akkineni, Tollywood

ఉత్తమ కథలు