Home /News /movies /

NAGARJUNA AKKINENI TOP MOST EARNING STAR AND HIS ASSETS AND DEBTS TA

Nagarjuna Akkineni: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆస్తుల విషయంలో నాగార్జున తోపు.. సాక్ష్యం ఇదిగో..

నాగార్జున (File/Photo)

నాగార్జున (File/Photo)

Nagarjuna Akkineni | తెలుగు సినిమా పరిశ్రమలో మన్మథుడుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నాగార్జున. కొడుకులు హీరోలైన ఇప్పటికీ తన గ్లామర్‌తో వారిని డామినేట్ చేస్తున్నారు. తాజాగా నాగార్జున ఆస్తులు..

    Nagarjuna Akkineni | తెలుగు సినిమా పరిశ్రమలో మన్మథుడుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నాగార్జున. కొడుకులు హీరోలైన ఇప్పటికీ తన గ్లామర్‌తో వారిని డామినేట్ చేస్తున్నారు. రియల్ లైఫ్‌‌ను రీల్ లైఫ్‌ను ఎంతో చాకచక్యంగా హాండిల్ చేస్తూ విజయవంతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నాగార్జున సినిమాల విషయంలో కాస్త వెనకబడ్డ.. సంపాదన విషయంలో మాత్రం నెంబర్‌వన్  స్థానంలో కొనసాగుతున్నారు.  ఇక బిగ్‌బాస్ తెలుగు రెండు సీజన్లకు  హోస్ట్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇపుడు తెలుగు బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ రియాలిటీ షోస్‌లో నటించేందకు  నాగార్జునకు స్టార్ మా భారీగానే పారితోషకం ముట్ట జెప్పినట్టు సమాచారం. 

    మరోవైపు సినిమాలతో సంపాదించేది ఉండనే ఉంది. మరోవైపు అన్నపూర్ణ సినీ స్టూడియో కొత్త దర్శకులను రైటర్స్‌ను పరిచయం చేస్తూ అందులో బాగానే వెనకేసుకున్నట్టు నాగార్జున సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే నాగార్జున వెరైటీ కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్‌లను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఇలా కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు, వ్యాపారాలతో నాగార్జున ఆస్తులు ఒక్కసారిగా పెరిగినట్టు సమాచారం. మరోవైపు స్టాక్ మార్కెట్‌లో కూడా నాగార్జున భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. వాటితో పాటు కొంత మంది స్నేహితులతో  రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారట. 

    Nagarjuna Akkineni Wild Dog Closing Collections And Theatrical Run Closed,Wild Dog Closing Collections: ’వైల్డ్ డాగ్’ క్లోజింగ్ కలెక్షన్స్.. నాగార్జున కెరీర్‌లో మరో డిజాస్టర్..,Wild Dog Closing Collections,Nagarjuna Wild Dog Closing Collections,Nagarjuna Wild Dog Closing Theatrical Collection,Wild Dog 1st weekend collections,nagarjuna Wild Dog 1st weekend collections,Wild Dog collections,nagarjuna twitter,chiranjeevi about nagarjuna Wild Dog movie,telugu cinema,నాగార్జున,నాగార్జున వైల్డ్ డాగ్ కలెక్షన్స్,నాగార్జున వైల్డ్ డాగ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,వైల్డ్ డాగ్ క్లోజింగ్ కలెక్షన్స్,నాగార్జున వైల్డ్ డాగ్ థియేట్రికల్ క్లోజింగ్ బిజినెస్
    ‘వైల్డ్ డాగ్’ మూవీలో నాగార్జున (Twitter/Photo)


    చేతి నిండా డబ్బులు ఉండటంతో నాగార్జున ఇపుడు  సొంత చార్టెట్ ఫ్లైట్‌ను కొనుగోలు చేసారు.   అంతేకాదు తాను వాడుకోని సందర్భాల్లో ఈ ఛార్టెట్ ఫ్లైట్‌ను అద్దెకు ఇచ్చే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు సమాచారం.  నాగార్జున రీసెంట్‌గా  చెన్నైలోని తన సోదరుడిని సంబందించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా.. అక్కడే ఆయనకు ఈ సొంత ఛార్టెడ్ ఫ్లైట్ కొనాలనే ఆలోచనకు వచ్చి ఆలోచనకు పెట్టారు. రీసెంట్‌గా నాగార్జున వైల్డ్‌డాగ్ సినిమాతో  పలకరించారు. థియేటర్స్‌లో అలరించని ఈ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సీక్రెట్ ‘రా’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకోవైపు ‘బంగార్రాజు’ సినిమాను త్వరలో తెరకెక్కించే పనిలో ఉన్నారు. మరోవైపు హిందీలో ’బ్రహ్మాస్త్ర’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఈ సినిమాను కరోనా లేకుండా సాధారణ పరిస్థితులు నెలకొంటే ఈ ఇయర్ ఎండింగ్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు .
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Nagarjuna Akkineni, Tollywood

    తదుపరి వార్తలు