కొడుకు హీరోయిన్‌పై కన్నేసిన నాగార్జున.. రకుల్ తర్వాత ఆమె..

మన్మథుడు 2 సినిమా తర్వాత నాగార్జున ఇమేజ్ భారీగా పడిపోయింది. దాంతో పోయిన ఇమేజ్ ఎలాగైనా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. అందుకే వెంటనే సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 27, 2019, 10:10 PM IST
కొడుకు హీరోయిన్‌పై కన్నేసిన నాగార్జున.. రకుల్ తర్వాత ఆమె..
అక్కినేని నాగార్జున (ఫైల్ ఫోటో)
  • Share this:
మన్మథుడు 2 సినిమా తర్వాత నాగార్జున ఇమేజ్ భారీగా పడిపోయింది. దాంతో పోయిన ఇమేజ్ ఎలాగైనా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. అందుకే వెంటనే సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో అనుకున్న బంగార్రాజు కథను కూడా పక్కనబెట్టేసాడు నాగార్జున. అందులో కూడా నాగ్ కారెక్టర్ రొమాంటిక్‌గానే ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు అలాంటి పాత్రలకు దూరంగా ఉంటేనే మంచిది అంటున్నాడు నాగ్. ప్రస్తుతం ఈయన సోలోమెన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈయన చెప్పిన కథ నచ్చడంతో కొత్త దర్శకుడైనా పర్లేదని ముందుకెళ్తున్నాడు మన్మథుడు. పైగా ఈయనకు కొత్త దర్శకులు చాలా వరకు వర్కవుట్ అయ్యాయి.
Nagarjuna Akkineni to romance with Kajal Aggarwal in his next movie directed by Solomen pk మన్మథుడు 2 సినిమా తర్వాత నాగార్జున ఇమేజ్ భారీగా పడిపోయింది. దాంతో పోయిన ఇమేజ్ ఎలాగైనా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. అందుకే వెంటనే సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో.. nagarjuna,nagarjuna akkineni,nagarjuna kajal aggarwal,nagarjuna movies,nagarjuna solomen,nagarjuna new movie,nagarjuna next movie,nagarjuna kajal,nagarjuna rakul preet singh,nagarjuna romance,nagarjuna manmadhudu 2,telugu cinema,nagarjuna police officer,నాగార్జున,నాగార్జున అక్కినేని,నాగార్జున కాజల్ అగర్వాల్,నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్,తెలుగు సినిమా
నాగార్జున కాజల్ అగర్వాల్

ఇప్పుడు సోలోమెన్ కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా ఒక సినిమాలో నటించనున్నాడు. ఏడాదిన్నర కింద రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాడు నాగ్. కానీ అప్పుడు ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు మళ్లీ పోలీస్ డ్రస్ వేసుకుంటున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించబోతుందని తెలుస్తుంది. ఈ మధ్య వరసగా సీనియర్ హీరోలకు మాత్రమే జోడీగా సరిపోతుంది కాజల్. చిరంజీవి, కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోల తర్వాత ఇప్పుడు నాగార్జున దగ్గరికి వచ్చేసింది. గతంలో దడ సినిమాలో నాగ చైతన్యతో రొమాన్స్ చేసింది కాజల్. ఇప్పుడు తండ్రితో ఆడిపాడబోతుంది.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు