హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna - The Ghost: నాగార్జున ‘ది ఘోస్ట్’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. అదిరిన నాగ్ యాక్షన్ ఎపిసోడ్స్..

Nagarjuna - The Ghost: నాగార్జున ‘ది ఘోస్ట్’ రిలీజ్ ట్రైలర్ విడుదల.. అదిరిన నాగ్ యాక్షన్ ఎపిసోడ్స్..

‘ది ఘోస్ట్’ రిలీజ్ ట్రైలర్ (Twitter/Photo)

‘ది ఘోస్ట్’ రిలీజ్ ట్రైలర్ (Twitter/Photo)

Nagarjuna - The Ghost | కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nagarjuna - The Ghost: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అక్కినేని హీరోలైన అఖిల్, నాగ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరై అలరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌తో పాటు టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగెలా చేసాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి. ఆ ఊపుతోనే ఇపుడు నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ సినిమాతో పలకరించారు.

బంగార్రాజు సినిమాతో పాటు రీసెంట్‌గా ’బ్రహ్మాస్త్ర’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ఓవరాల్‌గా ఫ్లాప్ అయినా.. తెలుగులో మాత్రం మంచి లాభాలనే తీసుకొచ్చింది. టాలీవుడ్‌లో ఈ సినిమా సక్సెస్ వెనక నాగార్జున ఉన్నాడనే చెప్పాలి. నాగ్ కారణంగా ఈ సినిమాకు తెలుగులో మంచి లాభాలు వచ్చాయి.దసరాకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుంటుందని చెప్పినట్టు టాక్. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు.ఈ సినిమా కోసం నాగార్జున రూ. 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘ది ఘోస్ట్’ మూవీలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో (The Ghost Glimps) నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు. తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది కూడా పూర్తి యాక్షన్ ప్యాక్డ్‌‌గా ఉంది. ఈ వయసులో కూడా నాగ్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేశారు.

యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకు వెళ్ళింది. ఈ వీడియో 'ది ఘోస్ట్' సినిమాపై ఉన్న అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం నాగార్జునతో పాటు హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఎలా కష్టపడింది. ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. అప్పట్లో 1988లో ఇదే రోజున నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ విడుదలై సంచలన విజయం సాధించింది. అదే తరహాలో ‘ది ఘోస్ట్’ మూవీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక  ఈ సినిమాతో పాటు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఉంది. మరోవైపు  బెల్లంకొండ గణేష్..‘స్వాతి ముత్యం’ సినిమాలు కూడా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానున్నాయి.

PS-1- Ponniyin Selvan Movie Review: పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ.. మణిరత్నం మార్క్ యావరేజ్ వార్ డ్రామా..

శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎలెల్పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమపార్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, మనీష్ చౌదరి, జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, బిలాల్ హుస్సేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.శతృవులను ఘోస్ట్ రూపంలో అంతమొందించే పాత్రలో నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు పేరు కోసమే కాదు.. ఎంతో మంది దేశం కోసం అజ్ఞాతంగా పనిచేస్తున్నారు. వారందరినీ ఉద్దేశించి ‘ఘోస్ట్’ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Nagarjuna Akkineni, The Ghost Movie, Tollywood

ఉత్తమ కథలు