హోమ్ /వార్తలు /సినిమా /

నాగార్జునకు వైరల్ ఫీవర్... కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్

నాగార్జునకు వైరల్ ఫీవర్... కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్

నాగార్జున ఫైల్ ఫోటో

నాగార్జున ఫైల్ ఫోటో

తన ఇంటితో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడమని మా వారితో చెప్పానన్నారు నాగార్జున.

సినీ సెలబ్రిటీలు సైతం విష జ్వరాల బారిన పడుతున్నారు. రేణు దేశాయ్‌కు డెంగీ ఎఫెక్ట్ ఇచ్చి ఆమె కోలుకుంటుంటే.. మరోవైపు అక్కినేని నాగార్జునకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. తనకు వైరల్ ఫీవర్ వచ్చినట్లు స్వయంగా నాగ్ ట్వీట్ చేశారు. తనకు వైరల్ జ్వరం వచ్చిందని... మురికి నీటి వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. దాని వల్ల అనారోగ్యానికి గురవుతామన్నారు నాగార్జున. జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ టాలీవుడ్ మన్మథుడు. జ్వరం నుంచి కోలుకున్నా... ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయన్నారు. తన ఇంటితో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడమని మా వారితో చెప్పానన్నారు. మీ ఇల్లు పనిచేస్తున్న పరిసరాల్లో మురికి నీటిని తొలగించాలన్నారు. అంటూ నాగ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. కొన్ని ఫోటోల్ని కూడా షేర్ చేశారు నాగార్జున.

ప్రముఖ నటి, పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ అనారోగ్యం పాలయ్యారు. డెంగీ బారిన పడినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దోమలతో జాగ్రత్తగా ఉండాలని తన అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా ఇంటి పరిసర ప్రాంతాల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్నా... కొన్ని గంటల పాటు షూటింగ్ ఉండటంతో కాదనలేకపోయానని తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్లో రేణు దేశాయ్ పోస్టు చేశారు.

First published:

Tags: Dengue fever, Health, Nagarjuna, Nagarjuna Akkineni, Tollywood, Tollywood news

ఉత్తమ కథలు