హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna: మీ అభిమానం మరిచిపోలేనిది.. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ నాగార్జున ధన్యవాదాలు..

Nagarjuna: మీ అభిమానం మరిచిపోలేనిది.. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ నాగార్జున ధన్యవాదాలు..

అక్కినేని నాగార్జున (Twitter/Photo)

అక్కినేని నాగార్జున (Twitter/Photo)

Nagarjuna Akkineni : ఈ రోజు అక్కినేని నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా నాగార్జున తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్యాన్స్, మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Nagarjuna Akkineni : ఈ రోజు అక్కినేని నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులతో పాటు శ్రేయోభిలాషులతో అక్కినేని మన్మథుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. దీంతో  నాగార్జున తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్యాన్స్, మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు తనకు ఎన్నో ఫోన్ కాల్స్‌తో పాటు మెసెజెస్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తనను అభిమానించి ఇంత మంది రుణం తీర్చుకోలేనిది అన్నారు. ఇక రాబోయే రెండు నెలలు తనకు అత్యంత కీలకం అన్నారు. సెప్టెంబర్ 4 నుంచి బిగ్‌బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది. మరోవైపు తాను హీరోగా నటించిన ‘బ్రహ్మస్త్ర’తో పాటు దసరా కానుకగా ‘ది ఘోస్ట్’ మూవీ విడుదల కానున్నట్టు తెలిపారు. ఒక రకంగా రాబోయే నెలలు తనకు అత్యంత కీలకం అన్నారు. నాగార్జున ఈ యేడాది నటించిన మూడు చిత్రాలు విడుదల కానుండటం విశేషం.

  నాగార్జున అక్కినేని విషయానికొస్తే.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకాదు తెలుగులో తండ్రి ANR తర్వాత భక్తికైనా..రక్తికైనా..క్లాస్ కైనా..మాస్ కైనా..అతనే బాస్. అన్నిరకాల పాత్రలను పోషించి ముఫ్పైఐదేళ్లుగా... సినీ జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

  ’విక్రమ్’ టూ రాబోయే ‘ధి ఘోస్ట్’. మరియు బ్రహ్మస్త్ర వరకు హీరోగా 36 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 36 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను అలరించిన అక్కినేని నాగార్జున మూడు పుష్కరాలుగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.అటు గ్లామర్ బాయ్ గా వలపుల పంట పండిస్తూనే....మాస్ చిత్రాల కథానాయకుడిగా మెప్పించారు.మాస్‌లో శివలాగే రెచ్చిపోయే గ్రీకు వీరుడు. క్లాస్‌లో అన్నమయ్యగా, శ్రీరామదాసుగా మెప్పించడం నాగార్జునకు మాత్రమే సాధ్యమే అయింది.

  నాగార్జున 1959 ఆగష్టు 29న చెన్నైలో జన్మించాడు. తండ్రి వారసత్వాన్ని తొలి చిత్రానికే పరిమితం చేసుకున్న ఈ వైవిధ్య హీరో ....విక్రమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే హీరోగా సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ మొదట్లో చాలా మంది నాగార్జున పర్సనాలిటీ హీరోగా పనికిరాదన్నారు. డైలాగ్ డెలవరీ బాగాలేదన్నారు. అయితే ఆ తర్వాతి రోజుల్లో నాగ్ వారి మాటలకు... తన నటనతో సమాధానం చెప్పారు. కెరీర్ తొలినాళ్లలో తండ్రి ఏఎన్నాఆర్ లా నాగార్జున ట్రాజెడీ కింగ్ గా పేరు గడించాడు. అలనాటి దేవదాసును గుర్తుకుతెచ్చేలా దాసరి డైరెక్షన్ లో వచ్చిన  ‘మజ్ను’ నాగార్జునకు మంచిపేరే తీసుకొచ్చింది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన మజ్ను నాగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది.

  HBD Nagarjuna : వర్మ నుంచి లారెన్స్, కళ్యాణ్ కృష్ణ టాలీవుడ్‌కు నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్..


  మొత్తంగా గీతాంజలి, శివతో పాటు హలో బ్రదర్, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మొత్తంగా 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగార్జునకు న్యూస్ 18 బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nagarjuna Akkineni, The Ghost Movie, Tollywood

  ఉత్తమ కథలు