నాగార్జున వయసు ఎంత.. ఇందులో పెద్దగా అనుమానాలు అక్కర్లేదు.. 60 ప్లస్. కానీ చూడ్డానికి మాత్రం అలా ఉండడు.. 30 ఏళ్ళు వెనక్కి వెళ్లి ఇంకా 30ల్లోనే ఉన్నట్లే కనిపిస్తుంటాడు కింగ్ నాగార్జున. అందుకే వయసు 60 దాటినా కూడా ఇప్పటికీ ఆయన్నే మన్మథుడు అంటుంటారు. ఆయన కూడా అదే ఫీల్ క్యారీ చేస్తుంటాడు. రెండేళ్ల కింద మన్మథుడు 2 అంటూ సినిమా చేసి.. అందులో లిప్ లాక్ సీన్స్ కూడా ఇరక్కొట్టేసాడు. అసలు నాగార్జున అంటే ఎవరో తెలియని వాళ్లకు ఆయన ఫోటోను చూపించి ఏజ్ అడిగితే నిజంగానే 30 అంటారు. అంత గ్లామర్ మెయింటేన్ చేస్తున్నాడు అక్కినేని అందగాడు. అయితే తాజాగా ఈయన ఒరిజినల్ ఫోటో బయటికి వచ్చింది. అదేంటి ఇన్నాళ్లూ ఒరిజినల్ కాదా అనుకుంటున్నారా..? మేకప్ లేకుండా.. న్యాచురల్‌గా ఎలా ఉంటాడో అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇన్నేళ్లకు అసలైన నాగార్జున బయటికి వచ్చాడు. ఆయన వయసు కూడా ఇప్పుడు బయటికి వచ్చింది.
ఎందుకంటే అందులో తన వయసుకు తగ్గట్లుగానే కనిపిస్తున్నాడు మన్మథుడు. నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. మేకప్ లేకుండా కింగ్ ఒరిజినల్‌గా ఇలా ఉంటాడా అని ఆరా తీస్తున్నారు అభిమానులు. కొన్నేళ్లుగా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా తన వయసు 30 మాత్రమే అని చెప్పుకుంటున్న నాగార్జునకు ఇప్పుడు మరో 30 జోడయ్యాయి.
ఉన్నట్లుండి ఒరిజినల్ లుక్‌లో కనిపించడం ఎంటా అని ఆలోచనలో పడిపోయారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు సినిమాతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. దాంతో పాటు బాలీవుడ్ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్రలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు అక్కినేని హీరో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Telugu Cinema, Tollywood