బంగార్రాజు విషయంలో నాగార్జున అనూహ్య నిర్ణయం..

హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దడ దడ లాడించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న బంగార్రాజు విషయంలో నాగార్జున అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: June 17, 2020, 9:58 AM IST
బంగార్రాజు విషయంలో నాగార్జున అనూహ్య నిర్ణయం..
నాగార్జున (File Photo)
  • Share this:
హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దడ దడ లాడించింది. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఇప్పటికిీ మరిచిపోయారు. అందువలన అదే టైటిల్‌తో.. ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను తెరకెక్కించబోతున్నట్టు నాగార్జునతో పాటు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికే  కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించాడు. దీంతో కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి నాగార్జున దగ్గరకు వెళ్లాడు. ఈ స్క్రిప్ట్ కూడా నాగార్జునను సాటిస్ఫై చేయలేదని టాక్.   అందుకే ప్రస్తుతానికి బంగార్రాజు తెరకెక్కించాలనుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు సమాచారం.

Akkineni Nagarjuna Do not pay any remunaration to director kalyan krishna for bangarraju sequel..here are the details,nagarjuna Akkineni,nagarjuna Akkineni bigg boss 3,nagarjuna twitter,nagarjuna Akkineni instagram,nagarjuna Akkineni facebook,nagarjuna Akkineni bangarraju sequel,nagarjuna Akkineni manmadhudu 2,nagarjuna do not any remunaration to kalyan krishna,kalyan krishna,nagarjuna movie updates,tollywood,telugu cinema,నాగార్జున,నాగార్జున అక్కినేని,నాగార్జున బిగ్‌బాస్ 3, నాగార్జున బంగార్రాజు సీక్వెల్,నాగార్జున బంగార్రాజు కళ్యాణ్ కృష్ణ,నాగార్జున మన్మథుడు 2,త్వరలో పట్టాలెక్కనున్న బంగర్రాజు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
అక్కినేని నాగార్జున,అఖిల్,నాగ చైతన్య


ప్రస్తుతం నాగార్జున సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు.  కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైల్డ్ డాగ్’ సినిమాతో  పాటు నాగార్జున హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకోవైపు ధనుశ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ఈ సినిమా  మళ్లీ పట్టాలెక్కనుంది. బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విషయానికొస్తే.. ఇందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్ర చేస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో నాగ్ పాత్ర షూటింగ్ పూర్తైపోయింది. మరోవైపు ధనుశ్‌తో మల్టీస్టారర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.   తాజాగా నాగార్జున గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశం కావడంతో నాగార్జున ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
First published: June 17, 2020, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading