హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna - Ram Charan: అప్పటి తరంలో నాగార్జునకు ఈ తరంలో రామ్ చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది..

Nagarjuna - Ram Charan: అప్పటి తరంలో నాగార్జునకు ఈ తరంలో రామ్ చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది..

నాగార్జున, రామ్ చరణ్ (Twitter/Photos)

నాగార్జున, రామ్ చరణ్ (Twitter/Photos)

Nagarjuna-Ram Charan | అప్పటి తరంలో నాగార్జునకు.. ఇప్పటి తరంలో రామ్  చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. 

    Nagarjuna-Ram Charan | అప్పటి తరంలో నాగార్జునకు.. ఇప్పటి తరంలో రామ్  చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. అప్పట్లో తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కోసం  నాగార్జున.. ఇప్పట్లో నాన్నమెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్‌ నిర్మాత అవతారం ఎత్తారు. రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లో ప్రవేశించిన తండ్రికి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకదు నిర్మాతగా తన ఇంటి పేరు మీద  కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్‌ను స్టార్ట్ చేసిన తండ్రి చిరుతో  వరుసగా ‘ఖైదీ నంబర్ 150, ‘సైరా నరిసింహా రెడ్డి ’  సినిమాలు నిర్మించాడు. ఇపుడు ముచ్చటగా మూడో చిత్రం ‘ఆచార్య’ను నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో తండ్రితో తెరను పంచుకోబోతున్నాడు.  ఈ రకంగా హీరోగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

    ప్రస్తుతం రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు లైన్‌లో పెట్టాడు. కరోనా నుంచి కోలుకున్నాక.. జనవరి 14 తర్వాత చరణ్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇంకోవైపు చిరంజీవి ఆచార్య తర్వాత వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
    చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)

    అటు నాగార్జున విషయానికొస్తే.. ఈయన కూడా తండ్రి నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు బాటలో సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు నిర్మాతగా అన్నపూర్ణ స్డూడియో పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక నాగార్జున కూడా అప్పట్లో తండ్రి నాగేశ్వరరావు హీరోగా ‘ప్రేమాభిషేకం’ ‘ శ్రీరంగనీతులు’, బుచ్చిబాబు’ శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ తో పాటు మనం వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించాడు. ఈ రకంగా వీళ్లిద్దరు తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోలుగా రికార్డులకు ఎక్కారు.

    తండ్రి నాగేశ్వరరావుతో నాగార్జున (File/Photo)

    అటు మరో దివంగత హీరో హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్‌ హీరోగా నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన ఫుల్ టైమ్ హీరోగా పనిచేయలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. నాగార్జున ఒక అడుగు ముందుకేసి తన ఇద్దరు కొడుకులు, మేనల్లుళ్లతో సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది.

    Fathers day special NBK Nandamuri Balakrishna special relaation ship with father NTR,Fathers day,fathers day special 2020,ntr balakrishna fathers day special,NTR,NBK 60,NBK,NTR NBK Combination Movies,balakrishna ntr combination movies,telugu matinee idol NTR,NTR Movies,NTR Chief Minister,Nandamuri balakrishna,NTR,nandamuri tarakarama rao,balakrishna,nbk ntr,nbk ntr combination films,nbk ntr films,balakrishna movies,ntr movies,balakrishan ntr combination movies,ntr biopic,ntr kathanayakudu,ntr mahanayakudu,tollywood,telugu cinema,balakrishna twitter,balakrishna facebook,balakrishna instagram,jr ntr twitter,rrr jr ntr,నందమూరి బాలకృష్ణ,నందమూరి తారక రామారావు,బాలయ్య,బాలకృష్ణ,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్,తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణ సినిమాలు,ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్ సినిమాలు,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా,బాలయ్య బోయపాటి సినిమా,ఎన్టీఆర్ జయంతి,బాలకృష్ణ పుట్టినరోజు,బాలయ్య పుట్టినరోజు,బాలయ్య పుట్టినరోజు,బాలకృష్ణ పుట్టినరోజు,ఫాదర్స్ డే స్పెషల్,ఎన్టీఆర్ బాలకృష్ణ ఫాదర్స్ డే స్పెషల్,ఎన్టీఆర్ బాలకృష్ణ గురు శిష్య అనుబంధం,బాలయ్య ఎన్టీఆర్ తండ్రీ కొడుకుల అనుబంధం
    తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణ,హరికృష్ణ (Twitter/Photo)

    ఈ రకంగా తండ్రి హీరోగా సినిమాలు నిర్మించిన కథానాయకుల లిస్టులో వీళ్లిద్దరు చోటు సంపాదించుకున్నారు. మిగతా హీరోలకు ఈ ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేము. ఏమైనా అప్పట్లో నాగార్జున... ఈ జనరేషన్‌లో రామ్ చరణ్‌కు మాత్రమే ఈ రికార్డు సాధ్యమైందనే చెప్పాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: ANR, Chiranjeevi, Harikrishna, Nagarjuna Akkineni, NTR, Ram Charan, Tollywood

    ఉత్తమ కథలు