నాగార్జున ట్రాక్ మార్చేసాడు.. వైల్డ్ డాగ్ అంటూ యాక్షన్ డ్రామా..

కొన్ని సినిమాలు అనుకున్న ఫలితం తీసుకురాకపోయినా కూడా హీరోలు పెద్దగా ఫీల్ అవ్వరు. కానీ కొన్ని మాత్రం ఫ్లాపులతో పాటు విమర్శలు కూడా తీసుకొస్తుంటాయి. అలాంటి సినిమా మన్మథుడు 2.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2019, 8:45 PM IST
నాగార్జున ట్రాక్ మార్చేసాడు.. వైల్డ్ డాగ్ అంటూ యాక్షన్ డ్రామా..
నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా పోస్టర్స్
  • Share this:
కొన్ని సినిమాలు అనుకున్న ఫలితం తీసుకురాకపోయినా కూడా హీరోలు పెద్దగా ఫీల్ అవ్వరు. కానీ కొన్ని మాత్రం ఫ్లాపులతో పాటు విమర్శలు కూడా తీసుకొస్తుంటాయి. అలాంటి సినిమా మన్మథుడు 2. నాగార్జున కెరీర్‌లో అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిన ఈ చిత్రం పరాజయంతో పాటు నాగార్జునకు విమర్శలు కూడా భారీగానే తీసుకొచ్చింది. అసలు ఇలాంటి వయసులో అలాంటి సినిమా ఏంటి.. ఆ లిప్ లాక్ సన్నివేశాలేంటి అంటూ నాగార్జునపై విరుచుకుపడ్డారు విశ్లేషకులు.. ఫ్యాన్స్‌కు కూడా ఈ చిత్రం నచ్చలేదు. ఈ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు యాక్షన్ డ్రామాతో వస్తున్నాడు మన్మథుడు. ఈ సినిమాకు వైల్డ్‌ డాగ్ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేసారు.


కొత్త దర్శకుడు సోలోమెన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాడు. కొత్త వాళ్లను నమ్మడం నాగార్జునకు ఇదే తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు కొత్త దర్శకులే నాగ్ కెరీర్‌ను మార్చేసే విజయాలు అందించారు. ఈ సినిమాలో నాగార్జున NIA అధికారి విజయ్‌ వర్మగా కనిపిస్తున్నాడు నాగార్జున. గతంలో గగనం సినిమాలో ఈ తరహా పాత్రలోనే నటించాడు ఈయన. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ టీంతో పని చేయడం చాలా కొత్తగా అనిపిస్తుందంటూ ట్వీట్ చేసాడు నాగార్జున. 2020లో అభిమానులను అలరించడం ఖాయం అంటున్నాడు ఈ సీనియర్ హీరో.

First published: December 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు