హోమ్ /వార్తలు /సినిమా /

Bangarraju : నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ ఎపుడంటే..

Bangarraju : నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ ఎపుడంటే..

Bangarraju World Television Premier | : అక్కినేని నాగార్జున , నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు'. ఇప్పటికే థియేటర్, ఓటీటీ వేదికగా సత్తా చాటిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ డేట్ ఫిక్స్ అయింది.  

  Bangarraju World Television Premier | : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం  మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాదు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 18 నుంచి  జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్స్‌లో చూసిన అక్కినేని ఫ్యాన్స్ మరోసారి ఓటీటీ వేదికగా చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  ఇక థియేటర్స్ లో ఈ సినిమా చూడని వాళ్లు కూడా ఈ సినిమాను ఓటీటీ వేదికగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ‘బంగార్రాజు’  వసూళ్ల విషయానికి వస్తే.. ఈ సినిమా 2022లో మన దేశంలో ఫస్ట్ హిట్ అందుకున్న సినిమాగా ‘బంగార్రాజు’ సినిమా రికార్డులకు ఎక్కింది. కరోనా థర్ట్ వేవ్‌లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది.

  నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే స్టోరీ కూడా బాగుండటంతో ఈ సినిమా పంట పండింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు అక్కడ మంచి  రెస్పాన్స్ వచ్చింది.

  Balakrishna - Mahesh Babu : బాలకృష్ణను ఆ విధంగా ఫుల్లుగా వాడుకున్న మహేష్ బాబు..

  తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ఈ నెల 27న జీ టీవీలో ప్రసారం కానుంది. థియేటర్, ఓటీటీ వేదికగా చూడని వాళ్లు ఈ సినిమాను ఎంచక్కా టీవీల్లో చూడొచ్చన్నమాట. ఈ సినిమా విడుదలపుడు  కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపాడు.

  The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్..

  పైగా చాలా యేళ్ల తర్వాత  ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.ఇక ‘బంగార్రాజు’ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే..  మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్‌కు గాను  రూ. 40  కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 2022లో మొదటి విజయంగా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్యలలు తండ్రీ కొడుకులుగా.. తాత మనవళ్లుగా నటించారు. ఈ సినిమాలో నాగార్జున.. తండ్రీ తనయులుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే కదా.

  First published:

  Tags: Bangarraju, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Tollywood

  ఉత్తమ కథలు