Bangarraju Twitter Review : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..
Bangarraju Twitter Review : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ట ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. నాగార్జున అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల క్లిప్‌లతో ఈ ట్రైలర్ పండగ శోభను ముందుగానే తీసుకొచ్చింది.
ఇందులో నాగచైతన్య.. నాగార్జున మనవడిగా కన్పించనున్నాడు. నాగచైతన్య, కృతి శెట్టిలను కలపడానికి నాగార్జున, రమ్యకృష్ణ చేసే ప్రయత్నాలు హైలెట్ గా నిలవనున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. నాగచైతన్య కూడా వాసివాడి తస్సాదియ్యా అనే డైలాగ్ మేనరిజంతో అదుర్స్ అన్పించాడు.ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..
#Bangarraju : Excellent first half and very good second half.. Perfect pongal film 👌.. Nag and Chay acting kummesaru 🔥👏. Positive response all over.. Pakka family entertainer 🤙
ilanti tweets chusi dabbulu 10ngettikokunda.. K muskoni #Pushpa ni Prime lo repeats veskondi.
మొత్తంగా సంక్రాంతి బరిలో దిగుతోన్న ఈ సినిమాకు ఇంకా చాలా చోట్ల షో పడని కారణంగా పూర్తి స్థాయిలో ప్రేక్షకులు, అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోయారు. మొత్తంగా ఈ సినిమాకు మంచి టాక్‌తో పండగ బరిలో దిగింది. పోటీలో పెద్ద సినిమాలేవి పోటీలో లేకపోవడం నాగార్జున ‘బంగార్రాజు’కు కలిసొచ్చే అంశం. ఇక ఈ సినిమా సూపర్‌గా ‘సోగ్గాడి చిన్నినాయనా’ మూవీని మించి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సహా పలు బడా సినిమాలు విడుదలవుతున్న తగ్గేదేలే అంటూ పొంగల్ పోటీలో నేనున్నాను అంటూ నాగార్జున రంగంలోకి దిగారు. తీరా సంక్రాంతి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’,(RRR) ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) సినిమాలు కరోనా కారణంగా వాయిదా వేసారు. ఈ రెండు సినిమాలు ప్యాన్ ఇండియా మూవీస్ కావడం.. ఇప్పటికే ఓమైక్రాన్ రూపంలో కరోనా మన దేశంపై విరుచుకుపడటంతో పాటు.. పలు రాష్రాల్లో సగం ఆక్యుపెన్షీతో థియేటర్స్ రన్ చేస్తుండంతో ఈ సినిమాలను అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. నాగార్జున ‘బంగార్రాజు’ మూవీకి ఇది కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో కరోనా కేసులో రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో అక్కడ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మరోవైపు అన్ని థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్షీతో రన్ చేయాలనే రూల్ తీసుకొచ్చారు. అంటే థియేటర్స్‌లో సీటుకు సీటుకు మధ్య ఒక ఖాళీ ఉండాలి. ప్రతి ఒక్క థియేటర్ యాజమాన్యం వీటిగా విధిగా పాటించాలన్నారు. లేకపోతే.. థియేటర్స్ లైసెన్స్ కాన్సిల్ చేసి సీజ్ చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మొత్తంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్రాంతికి బరిలో దిగుతున్న నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. నైట్ కర్ఫ్యూ మూలంగా రోజుకు మూడు షోలకు మించి ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు సగం ఆక్యపెన్షీ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తంగా రూ. 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఏపీ ప్రభుత్వ నియమ నిబంధలనకు అనుగుణంగా టార్గెట్ రీచ్ కావడం అంత ఈజీ కాదంటున్నారు ట్రేడ్ పండితులు. నాగార్జున కెరీర్లో ఇది హైయెస్ట్ బిజినెస్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా వసూళ్లను రాబట్టనుందో.
బంగార్రాజులో టీమ్ (Twitter/Photo)
బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో ఏకంగా 8 మంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు. . రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ కాగా.. మరో ఆరుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ బంగార్రాజు సినిమాలో కనిపించనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.