Nagarjuna Akkineni Naga Chaitanya Bangarraju Streaming Date Fix : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు'. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Bangarraju Streaming Date Fix : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు 2022లో మన దేశంలో ఫస్ట్ హిట్ అందుకున్న సినిమాగా ‘బంగార్రాజు’ సినిమా రికార్డులకు ఎక్కింది. కరోనా థర్ట్ వేవ్‌లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే స్టోరీ కూడా బాగుండటంతో ఈ సినిమా పంట పండింది.
కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.మొదటి నాలుగు రోజులు జోరు చూపించిన ఈ సినిమా ఐదో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని జీ 5 ఓటీటీ వేదికగా ఈ నెల 18న స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఇక ‘బంగార్రాజు’ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పటి వరకు 39.61 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 2022లో మొదటి విజయంగా నిలిచింది. అయితే నైజాంలో మాత్రం 2.5 కోట్లు వెనకబడి ఉంది బంగార్రాజు. ఇక్కడ 11.50 కోట్ల బిజినెస్ చేస్తే వచ్చింది 9 కోట్లు మాత్రమే. అయితే ఏపీలో మాత్రం ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాలలో లాభాలు వచ్చాయి. ఓవర్సీస్ కూడా బంగార్రాజు సేఫ్ కాలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.