Home /News /movies /

NAGARJUNA AKKINENI NAGA CHAITANYAS BANGARRAJU FIRST DAY WORLD WIDE COLLECTIONS TA

Bangarraju First Day Collections : నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర అక్కినేని హీరోస్ ఊచకోత..

బంగార్రాజు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ (Bangarraju Photo :Twitter)

బంగార్రాజు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ (Bangarraju Photo :Twitter)

Bangarraju First Day Collections :  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    Bangarraju First Day Collections :  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు అయింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఒకే స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.

    ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్, ట్రైలర్‌తోనే అర్ధమైంది. ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను ఫిదా చేస్తున్నారు.  చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు.  ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల పండగ శోభను ముందుగానే తీసుకొచ్చింది. పైగా పాజిటివ్ టాక్.. పైగా పోటీలో పెద్ద సినిమాలేని లేకపోవడం బాగానే కలిసొచ్చింది. ఈ సినిమా తెలంగాణ, ఏపీలో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది.

    NBK - NTR - Allu Arjun : అల్లు అర్జున్ రూట్లో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, బాలయ్య.. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న హీరోలు..


    నైజాం(తెలంగాణ) : రూ. 2.03 కోట్లు / రూ. 11 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 1.74 కోట్లు / రూ. 6 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ.1.24 కోట్లు / రూ. 4.05 కోట్లు
    ఈస్ట్:రూ 0.76 కోట్లు / రూ. 2.8 కోట్లు
    వెస్ట్: రూ. 0.65 కోట్లు / రూ. 2.6 కోట్లు
    గుంటూరు:రూ. 0.89 కోట్లు / రూ. 3.20 కోట్లు
    కృష్ణా: 0.46 కోట్లు / రూ. 2.70 కోట్లు
    నెల్లూరు: రూ.0.34 కోట్లు / 1.45 కోట్లు


    తెలంగాణ + ఏపీ : రూ. 8.11 కోట్లు షేర్ ( 12.9 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు..
    రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.0.80 కోట్లు / రూ. 2.15 కోట్లు..

    ఓవర్సీస్ : రూ. 0.45 కోట్లు..  / రూ. 2.20 కోట్లు..                                                                                   టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ.9.36 కోట్లు షేర్ (రూ. 15.35 కోట్ల గ్రాస్ వసూళ్లు)  / రూ.  38.15 కోట్లు వసూళ్లు

    మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. మొదటి రోజు రూ. 9 కోట్లకు పైగా షేర్ రావడం  ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్‌‌లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.

    Chiranjeevi : పండగ రోజున తన రిటైర్మెంట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన చిరంజీవి.. మెగాస్టార్ సంచలన నిర్ణయం..

    బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Nagarjuna Akkineni, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు