NAGARJUNA AKKINENI NAGA CHAITANYAS BANGARRAJU 6 DAYS WORLD WIDE COLLECTIONS HUGE DROPS ON 6TH DAY TA
Bangarraju 6 Days WW collections : ‘బంగార్రాజు’ 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర తగ్గిన అక్కినేని హీరోల జోరు..
‘బంగార్రాజు’ 6 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)
Bangarraju 6 Days World Wide Collections : అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 6వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..
Bangarraju 4 Days World Wide Collections : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు అయింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఒకే స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. మొదటి నాలుగు రోజులు జోరు చూపించిన ఈ సినిమా ఐదో, ఆరు రోజు జోరు కాస్తంత తగ్గిందనే చెప్పాలి.
ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు. చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల పండగ శోభను ముందుగానే తీసుకొచ్చింది. పైగా పాజిటివ్ టాక్.. పైగా పోటీలో పెద్ద సినిమాలేని లేకపోవడం బాగానే కలిసొచ్చింది. ఈ సినిమా తెలంగాణ, ఏపీలో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొదటి నాలుగు రోజులు కుమ్మేసింది. 6వ రోజు మాత్రం కేవలం రూ. 0.95 కోట్లు మాత్రమే వసూలు చేసింది బంగార్రాజు. మీడియం రేంజ్ సినిమాలలో మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం.
తెలంగాణ + ఏపీ : రూ. 29.97కోట్లు షేర్ ( 48.50 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.1.60 కోట్లు / రూ. 2.15 కోట్లు..
ఓవర్సీస్ : రూ. 1.32 కోట్లు.. / రూ. 2.20 కోట్లు.. టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ.32.89 కోట్లు షేర్ (రూ. 55.10 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 38.15 కోట్లు వసూళ్లు..
మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ. 7 కోట్ల వరకు షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, నెల్లూరులో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసింది. తెలంగాణలో మరో రూ. 3 కోట్ల దూరంలో ఉంది ఈమూవీ. మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.
బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.