Home /News /movies /

NAGARJUNA AKKINENI NAGA CHAITANYAS BANGARRAJU 4 DAYS WORLD WIDE COLLECTIONS TA

Bangarraju 4 Days Collections : ‘బంగార్రాజు’ 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. నాగార్జున, నాగ చైతన్య మాస్ కుమ్ముడు..

బంగార్రాజు కలెక్షన్స్  (Bangarraju/Photo)

బంగార్రాజు కలెక్షన్స్ (Bangarraju/Photo)

Bangarraju 4 Days World Wide Collections :  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 4వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    Bangarraju 4 Days World Wide Collections :  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు అయింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఒకే స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.

    ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు.  చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు.  ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల పండగ శోభను ముందుగానే తీసుకొచ్చింది. పైగా పాజిటివ్ టాక్.. పైగా పోటీలో పెద్ద సినిమాలేని లేకపోవడం బాగానే కలిసొచ్చింది. ఈ సినిమా తెలంగాణ, ఏపీలో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు కుమ్మేసింది. మొదటి మూడు రోజుల్లో మంచి వసూళ్లనే సాధించింది. నాల్గో రోజు కూడా ‘బంగార్రాజు’ కూడా డీసెంట్‌ కలెక్షన్స్ రాబట్టింది.

    Hero As Film Industry Based Movie : అశోక్ గల్లా ’హీరో’ మూవీ సహా తెలుగులో సినీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..

    నైజాం(తెలంగాణ) : రూ. 7.14 కోట్లు / రూ. 11 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 5.31 కోట్లు / రూ. 6 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 3.74 కోట్లు / రూ. 4.05 కోట్లు
    ఈస్ట్:రూ 3.03 కోట్లు / రూ. 2.8 కోట్లు
    వెస్ట్: రూ. 2.17 కోట్లు / రూ. 2.6 కోట్లు
    గుంటూరు:రూ. 2.67 కోట్లు / రూ. 3.20 కోట్లు
    కృష్ణా: 1.70 కోట్లు / రూ. 2.70 కోట్లు
    నెల్లూరు: రూ.1.36 కోట్లు / 1.45 కోట్లు


    తెలంగాణ + ఏపీ : రూ. 27.12 కోట్లు షేర్ ( 43.80 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు..
    రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.1.56 కోట్లు / రూ. 2.15 కోట్లు..

    ఓవర్సీస్ : రూ. 1.28 కోట్లు..  / రూ. 2.20 కోట్లు..                                                                                   టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ.29.96 కోట్లు షేర్ (రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు)  / రూ.  38.15 కోట్లు వసూళ్లు..

    NTR Death Anniversary : నేడు అన్న ఎన్టీఆర్ 26వ వర్థంతి.. నటనలో, రాజకీయాల్లో అన్నగారి రూటే సెపరేటు..

    మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ. 9 కోట్ల షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్‌‌లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.

    Dhanush Aishwarya Divorce : నాగ చైతన్య, సమంత బాటలో విడాకులు తీసుకున్న ధనుశ్, ఐశ్యర్య దంపతులు..

    బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు