NAGARJUNA AKKINENI NAGA CHAITANYA RAMYA KRISHNA KRITHI SHETTY BANGARRAJU COLLECTIONS IN NIZAM VERY POOR SR
Bangarraju : బంగార్రాజుకు నైజాంలో ఆదరణ కరువు.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..
బంగార్రాజు కలెక్షన్స్ (Twitter/Photo)
Bangarraju Collections : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది.
Bangarraju Collections : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూనే ఉన్నాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.
అయితే ఈ సినిమా ఏపీలో మాత్రం మంచి వసూళ్లను రాబడుతూ అక్కడ సేఫ్ జోన్లో ఉంటే.. తెలంగాణలో మాత్రం అంత రివర్స్‌గా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను ఇక్కడ చూసే వాళ్లు కరువైయారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా తెలంగాణలో పెద్దగా వసూళ్లును రాబట్టలేకపోయింది. ఈ సినిమా తొలిరోజు నుంచి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరీ దారుణంగా బంగార్రాజు ఈ ఏరియాలో ఈ సినిమా 7 కోట్ల షేర్‌ను కూడా దాటలేదని తెలుస్తోంది. ఈ రేంజ్ సినిమాకు మంచి టాక్ ఉంటే మామూలుగా నైజాంలో మూడు రోజుల్లోనే వసూళ్లు సాధిస్తాయి. కానీ సెలవుల సీజన్లో ఉన్నప్పటికీ ఈ సినిమాను ఇక్కడ చూసేవారు లేరు. దీంతో తెలంగాణలో బంగార్రాజు థియేటర్ రన్ దాదాపు ముగిసినట్లేనని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక తాజాగా ఈ సినిమా నిన్నటితో 2 వారాలు పూర్తి చేసుకుంది. ఇక 14వ వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 2 లక్షల కలిపి మొత్తంగా రూ. 28 లక్షల షేర్ సాధించింది. ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఏపీలో ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు.
మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బంగార్రాజు. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ 2 కోట్ల వరకు షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. ఈ సినిమా ఏపీలో తక్కువ రేట్స్‌కు అమ్మడంతో లాభాల్లోకి వచ్చింది. 100 శాతం ఆక్యుపెన్షీ ఉన్న నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో ‘బంగార్రాజు’కు ఆశించినంత రెస్పాన్స్ దక్కలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.
బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.