Nagarjuna - Bangarraju : ఇప్పటికే సంక్రాంతి బరిలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జవనరి 7న ముందుగా సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో రంగంలోకి దిగుతోంది. దాంతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’, జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే.. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్‌లో మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమా జనవరి 13న విడుదల కానున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఎన్నడు లేనట్టుగా ప్రస్తుతం తెలుగు టాప్ లీగ్ హీరోలందరూ సంక్రాంతి బరిలో సై అంటే సై అంటున్నారు. ఇంత గట్టి పోటీలో కూడా నాగార్జున అక్కినేని ...నేనున్నంటూ బంగార్రాజు మూవీతో బరిలో దిగబోతున్నట్టు సమాచారం. అంతేకాదు బంగార్రాజు మూవీపై నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే థియేట్రికల్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చలు పూర్తైయినట్టు సమాచారం. ఇక సంక్రాంతి బరిలో ఇపుడు చెప్పుకుంటున్న సినిమాల్లో మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమా, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలు విడుదల తేదిలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయట.
అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్టీఆర్.. ఆపై మహేష్ బాబు, పవన్ కళ్యాణ్..
నాగార్జున విషయానికొస్తే.. ఈ యేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లను సాధించలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’(Bangarraju) సినిమా పట్టాలెక్కింది.
Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..
‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఈ సినిమాలో మరో హీరోగా నాగార్జున తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. నాగార్జున సరసన మరోసారి రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కాకుండా.. మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నట్టు సమాచారం. అందులో ఖిలాడీ భామ మీనాక్షి చౌదరి మరో ముఖ్యపాత్రలో నటిస్తోన్నట్టు సమాచారం.
దాంతో పాటు బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గుజ్జర్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. సోగ్గాడే చిన్నినాయనా’లో అనసూయ,హంసా నందిని పాత్రల మాదిరిగానే.. ఇపుడు బంగార్రాజులో వీళ్ల పాత్ర ఉంటుందని చెబుతున్నారు.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. ? ఇంతకీ ఎపుడంటే..
నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందని ద్రాక్షనే అయింది. అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు ప్రీక్వెల్ చేస్తున్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.
NBK - Dual Role: అఖండ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారో తెలుసా..
ఇప్పటికే ఈ సినిమ ా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. ఇప్పటికే నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మనం తర్వాత వీళ్లిద్దరు కలిసి ఈ సినిమా నటిస్తుండంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. నాగ చైతన్య విషయానికొస్తే.. రీసెంట్‌గా ‘లవ్ స్టోరీ’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించిన తొలి మూవీగా రికార్డులకు ఎక్కింది.
ఈ సినిమాతో పాటు ’థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుంది. అటు ఆమీర్ ఖాన్‌తో నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’ మూవీ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. మరి నాగార్జున.. సంక్రాంతి బరిలో నిజంగానే రంగంలోకి దిగే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kalyan Krishna, Krithi shetty, Meenakshi Chaudhary, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Ramya Krishna, Tollywood