హోమ్ /వార్తలు /సినిమా /

Bangarraju : ‘బంగార్రాజు’ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్టేట్.. పండగ చేసుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్..

Bangarraju : ‘బంగార్రాజు’ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్టేట్.. పండగ చేసుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్..

నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ టీజర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ టీజర్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Nagarjuna - Naga Chaitanya - Bangarraju : నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Nagarjuna - Naga Chaitanya - Bangarraju : నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’. ఇప్పటికే చైతూ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున (Nagarjuna) లెవల్లో నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఇంత వరకు క్లారిటీ లేదు. సంక్రాంతి విడుదల అని అంటున్నారు కానీ ప్రమోషన్స్‌‌లో వెనుకబడి ఉంది. దీంతో అసలు బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా.. లేదా అనే క్లారిటీ లేక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫూజన్‌లో ఉన్నారు. ఇప్పటికే  ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.

ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘వాసివాడి తస్సాదియ్సా సాంగ్  ‘నా కోసం’ సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌తో  దుమ్ముదులుపుతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రేపు న్యూ ఇయర్ కానుకగా ఉదయం 11.22 నిమిషాలకు విడుదల చేస్తున్నారు.

ఇక సంక్రాంతికి వస్తామని ప్రకటించిన పలు సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం పోస్ట్ పోన్ కాగా, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కు  వాయిదా పడింది.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కానుండగా.. ప్రభాస్ రాధే శ్యామ్ 14 వ తేదీన విడుదల కానుంది.

Bangarraju Movie Nagarjuna Akkineni Naga Chaitanya News18
‘బంగార్రాజు’గా నాగార్జున, నాగ చైతన్య (Twitter/Photo)

ఇక ఇదే రేసులో ఉన్న అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బంగార్రాజు చిత్రం విడుదల జనవరి 15 వ తేదీన విడుదల చేయాలనే కసి మీదున్నారు నాగార్జున.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఓమ్రికాన్ కారణంగా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రాలు నమ్మకంగా చెప్పిన డేట్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా.. ఏపీలో టిక్కెట్ రేట్స్ పలు కారణాల వల్ల వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Year Ender 2021 : ఈ యేడాది టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు..

ఇక తండ్రి నాగార్జునతో నాగ చైతన్యకు ‘బంగార్రాజు’ మూడో సినిమా. మొదటి సారి వీళ్లిద్దరు కలిసి  అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘మనం’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత నాగ చైతన్య తన తండ్రితో కలిసి ‘ప్రేమమ్’లో నటించారు. ఈ సినిమాలో చైతూ ఫాదర్ పాత్రలో నాగార్జున అదరగొట్టారు.తాజాగా నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జునతో కలిసి మూడో సారి కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తోన్న.. ఒక సారి స్క్రీన్ పై కనబడతారా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నారు.

First published:

Tags: Krithi shetty, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Ramya Krishna, Tollywood