హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna - Bangarraju : నాగార్జున, నాగ చైతన్య ‘బంగార్రాజు’ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు ముహూర్తం ఖరారు..

Nagarjuna - Bangarraju : నాగార్జున, నాగ చైతన్య ‘బంగార్రాజు’ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు ముహూర్తం ఖరారు..

12. బంగార్రాజు: జనవరి 15, 2022

12. బంగార్రాజు: జనవరి 15, 2022

Nagarjuna - Bangarraju : నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు ముహూర్తం ఖరారు చేశారు. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేయనున్నారు.

  Nagarjuna - Bangarraju : నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు ముహూర్తం ఖరారు చేశారు. నాగార్జున ఈ యేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లను సాధించలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’(Bangarraju) సినిమా పట్టాలెక్కింది.  ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఈ సినిమాలో మరో హీరోగా నాగార్జున తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. తాజాగా నాగలక్ష్మిగా విడుదల చేసిన కృతి శెట్టి లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఈ సినిమాలో నాగార్జున సరసన మరోసారి రమ్యకృష్ణ యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ‘బంగార్రాజు’ లుక్‌తో పాటు టీజర్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా  ఈ సినిమా ఫస్ట్ లుక్  ఒక రోజు ముందు  22 నవంబర్ 22న సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇక టీజర్‌ను ఉదయం 10.23 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కాకుండా.. మరో ఇద్దరు హీరోయిన్స్‌ నటిస్తున్నట్టు సమాచారం. అందులో ఖిలాడీ భామ మీనాక్షి చౌదరి మరో ముఖ్యపాత్రలో నటిస్తోన్నట్టు సమాచారం. దాంతో పాటు బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గుజ్జర్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. సోగ్గాడే చిన్నినాయనా’లో అనసూయ,హంసా నందిని పాత్రల మాదిరిగానే..  ఇపుడు బంగార్రాజులో వీళ్ల పాత్ర ఉంటుందని చెబుతున్నారు.

  Prema Nagar@50Years : అక్కినేని, వాణిశ్రీల ‘ప్రేమనగర్’కు 50 యేళ్లు పూర్తి.. తెర వెనక కథ..


  నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందని ద్రాక్షనే అయింది. అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు ప్రీక్వెల్  చేస్తున్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.

  Love Story Movie Review : నాగ చైతన్య, సాయి పల్లవిల ’లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ.. ఎమోషనల్ లవ్ డ్రామా..


  ఇప్పటికే ఈ సినిమ ా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. ఇప్పటికే  నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మనం తర్వాత వీళ్లిద్దరు కలిసి ఈ సినిమా నటిస్తుండంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.

  Tollywood Industry Hits: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీస్.. బాహుబలి సహా ఎక్కువ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..


  ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ‘రాధే శ్యామ్’, పవన్, రానా మూవీతో పాటు ఇపుడు నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ కూడా విడుదలకు ఉరకలు వేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఫస్ట్ లుక్, టీజర్‌‌లో ఈ సినిమా విడుదల తేదిని అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

  NBK - Dual Role: అఖండ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారో తెలుసా..


  నాగ చైతన్య విషయానికొస్తే.. తాజాగా ‘లవ్ స్టోరీ’ సినిమాతో పలకరించారు. దాంతో పాటు ’థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bangarraju, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Ramya Krishna, Tollywood

  ఉత్తమ కథలు