Home /News /movies /

NAGARJUNA AKKINENI NAGA CHAITANYA BANGARRAJU 8 DAYS WORLD WIDE COLLECTIONS TA

Bangarraju 8 Days Collections : నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ 8 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో..

బంగార్రాజు (Twitter/Photo)

బంగార్రాజు (Twitter/Photo)

Bangarraju 1st Week World Wide Collections :  అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా వారం పూర్తి చేసుకొని 2వ వారంలో అడుగపెట్టింది. ఇక 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    Bangarraju 1st Week Collections :  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). ఈ  సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం  మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఒకే స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. మొదటి నాలుగు రోజులు జోరు చూపించిన ఈ సినిమా ఐదో రోజు, నుంచి డ్రాప్స్ కనిపిస్తున్నాయి. కరోనా భయంతో ఆరు రోజుతో పాటు 7వ రోజు, బంగార్రాజు కలెక్షన్స్ ‌తగ్గాయి. తాజాగా 8వ రోజు కూడా ఏదో పర్వాలేదనే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.

    ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు.  చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు.   పైగా పాజిటివ్ టాక్.. పైగా పోటీలో పెద్ద సినిమాలేని లేకపోవడం బాగానే కలిసొచ్చింది. ఈ సినిమా తెలంగాణ, ఏపీలో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొదటి నాలుగు రోజులు కుమ్మేసింది. ఐదు,ఆరు రోజుల్లో తీవ్రంగా పడిపోయిన కలెక్షన్స్.. 8 రోజు తెలంగాణ, ఏపీలో రూ. 51 లక్షల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా  మొత్తంగా కేవలం రూ. 49 లక్షలు  మాత్రమే వసూలు చేసింది బంగార్రాజు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 46 లక్షల షేర్ రాబట్టింది.

    Nagarjuna - Ramya Krishna : ‘బంగార్రాజు’ సక్సెస్‌తో తమ జోడికి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న నాగార్జున, రమ్యకృష్ణ..

    నైజాం(తెలంగాణ) : రూ. 7.67 కోట్లు / రూ. 11 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 6.01 కోట్లు / రూ. 6 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 4.47 కోట్లు / రూ. 4.05 కోట్లు
    ఈస్ట్:రూ 3.61 కోట్లు / రూ. 2.8 కోట్లు
    వెస్ట్: రూ. 2. 58 కోట్లు / రూ. 2.6 కోట్లు
    గుంటూరు:రూ. 3.07 కోట్లు / రూ. 3.20 కోట్లు
    కృష్ణా: 1.98 కోట్లు / రూ. 2.70 కోట్లు
    నెల్లూరు: రూ.1.55 కోట్లు / 1.45 కోట్లు


    తెలంగాణ + ఏపీ : రూ. 30.94కోట్లు షేర్ ( 50.02 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు..
    రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.1.63 కోట్లు / రూ. 2.15 కోట్లు..

    ఓవర్సీస్ : రూ. 1.37 కోట్లు..  / రూ. 2.20 కోట్లు..                                                                                  టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ.33.94 కోట్లు షేర్ (రూ. 55.10 కోట్ల గ్రాస్ వసూళ్లు)  / రూ.  38.15 కోట్లు వసూళ్లు..

    మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ. 4.5 కోట్ల వరకు షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, నెల్లూరులో ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది. తెలంగాణలో మరో రూ. 3 కోట్ల దూరంలో ఉంది ఈమూవీ.  మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్‌‌లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.

    Ravi Teja : హీరో రవితేజ తల్లిపై పోలీసు కేసు నమోదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

    బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Nagarjuna Akkineni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు