నాగార్జున ఇంటిపై ఐటి దాడులు.. కన్ఫర్మ్ చేసిన మన్మథుడు..

తెలుగు ఇండస్ట్రీలో ఉన్నట్లుండి ఐటి దాడుల కలకలం అందరికీ షాక్ ఇచ్చింది. స్టార్ హీరోలతో పాటు అగ్ర నిర్మాణ సంస్థలపై కూడా ఐటి దాడులు జరిగాయి. హీరోల్లో నాని ఇంటిపై ఐటి అధికారులు దాడి చేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2019, 7:41 PM IST
నాగార్జున ఇంటిపై ఐటి దాడులు.. కన్ఫర్మ్ చేసిన మన్మథుడు..
నాగార్జున (Instagram/Photo)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్నట్లుండి ఐటి దాడుల కలకలం అందరికీ షాక్ ఇచ్చింది. స్టార్ హీరోలతో పాటు అగ్ర నిర్మాణ సంస్థలపై కూడా ఐటి దాడులు జరిగాయి. హీరోల్లో నాని ఇంటిపై ఐటి అధికారులు దాడి చేసారు. కొన్ని గంటలపాటు లెక్కలు చూసారు. ఆడిటర్లతో కలిసి అన్నీ తేల్చుకున్నారు. ఈయన ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు.. దాదాపు 20 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్.. సురేష్ బాబు ఇల్లు, ఆఫీసులపై కూడా దాడులు జరిగాయి. అయితే వీళ్లందరితో పాటే నాగార్జున ఇంటిపై కూడా ఐటి దాడులు జరిగాయని వార్తలొచ్చాయి. ఈ విషయంపై అటు నాగార్జున కానీ.. ఇటు ఆయనకు సంబంధించిన వాళ్లు కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

దాంతో నిజంగానే ఐటి దాడులు జరిగాయనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనిపై నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. తనను చాలా మంది మిత్రులు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు.. మీ ఆఫీస్, ఇంటిపై ఐటి అధికారులు వచ్చి సోదాలు చేసారట కదా అని.. అందరికీ ఒకే సమాధానం ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేసాడు మన్మథుడు. ఐటి దాడుల గురించి మీరు ఫోన్ చేసి అడిగితే కానీ నాకు తెలియదంటూ ట్విస్ట్ ఇచ్చాడు నాగ్. అంతేకాదు.. తన ఇంటిపై ఎలాంటి ఐటి దాడులు జరగలేదని.. ఎవరూ రాలేదని కన్ఫర్మ్ చేసాడు. దాంతో అక్కినేని అభిమానులు కాస్త కుదుటపడ్డారు. మొత్తానికి ఐటి దాడులు ప్రస్తుతం అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ జాబితాలో నెక్ట్స్ ఎవరున్నారో మరి..?
First published: November 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...