Nagarjuna Akkineni: ‘వైల్డ్ డాగ్’ విషయంలో నాగార్జున చేసిన అతి పెద్ద తప్పు అదేనా.. అంటే ఔననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత నాగార్జున నటించిన సినిమాలేవి హిట్టైయిన దాఖలాలు లేవు. చాలా రోజులు తర్వాత అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ‘వైల్డ్ డాగ్’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకుల నుంచి సరైన స్పందన కరువైంది. దీంతో కలెక్షన్లు లేక ఈ సినిమా కుదైలైంది. కరోనా కారణంగా థియేటర్స్‌కు ప్రేక్షకులు వస్తారో రారో అని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల చేయడానికి మూడు నెలల క్రితమే డీల్ పూర్తైయింది. కానీ సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘క్రాక్’ ‘మాస్టర్’ వంటి సినిమాలకు కలెక్షన్లు బాగా రావడంతో నాగార్జున,..నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేసారు.
దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి వచ్చి ఈ సినిమాను తన మౌత్ టాక్‌తో జాకీలు పెట్టి లేపట్టినా... ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తే రూ. 20 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ థియేటర్లో విడుదల తర్వాత సగానికి సగం అంటే రూ. 10 కోట్లకు డీల్ ముగించారు. మొత్తంగా ఈ సినిమాను అమ్మిన రేట్లలో సగం కూడా రికవరీ కాలేదు. మొత్తంగా ఈ సినిమాను కొన్న వాళ్లు నిండా మునిగారు. పైగా నెక్ట్స్ వీక్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ కావడంతో ఈ సినిమాను అన్ని థియేటర్స్‌లో లేపేసారు. పైగా ఈ సినిమా కథ రూ. 3 కోట్లకే ముగిసి పోయింది. మొత్తంగా ‘వైల్డ్ డాగ్’ విషయంలో నాగార్జున వేసిన స్కెచ్ ఆయనతో పాటు నిర్మాతలను నిండా ముంచేసింది. పైగా హీరోగా నాగార్జున.. మార్కెట్ ఏంటో మరోసారి ఋజువు చేసింది ‘వైల్డ్ డాగ్’ మూవీ. మొత్తంగా నాగార్జున కెరీర్లో ‘వైల్డ్ డాగ్’ సినిమా ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.