నాగార్జున కెరీర్‌లో మరోసారి ఆ సాహసం చేస్తున్నాడు..

ఈ యేడాది నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న‘మన్మథుడు 2’ నాగార్జున ఆశలపై నీళ్లు జల్లింది. ఈ సినిమా తర్వాత నాగార్జున సైలెంట్‌గా ‘వైల్డ్ డాగ్’ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం నాగార్జున.. మరోసారి

news18-telugu
Updated: December 31, 2019, 7:52 AM IST
నాగార్జున కెరీర్‌లో మరోసారి ఆ సాహసం చేస్తున్నాడు..
నాగార్జున (File Photo)
  • Share this:
ఈ యేడాది నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న‘మన్మథుడు 2’ నాగార్జున ఆశలపై నీళ్లు జల్లింది. ఈ సినిమా తర్వాత నాగార్జున సైలెంట్‌గా ‘వైల్డ్ డాగ్’ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో నాగ్.. ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో కనిపించున్నాడు. ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు సోలోమెన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాడు. కొత్త వాళ్లను నమ్మడం నాగార్జునకు ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు కొత్త దర్శకులే నాగ్ కెరీర్‌ను మార్చేసే విజయాలు అందించారు. కథ ప్రకారం ఈ చిత్రంలో నాగార్జునకు హీరోయిన్ ఉండదని సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో పాటలు కూడా లేకుండా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో నాగార్జున ‘గగనం’, ‘శిరిడిసాయి’ చిత్రాల్లో హీరోయిన్ లేకుండా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు చాలా రోజుల తర్వాత కథానాయిక లేకుండా సోలో‌గా వెండితెరపై తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నడన్న మాట.

First published: December 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు