నాగార్జున ఆ విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యాడా..?

Nagarjuna Akkineni: నాగార్జున ఒకప్పుడు వరస సినిమాలు చేసాడు.. ఏడాదికి రెండు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సీనియర్ హీరోలంతా ఒక్కటే చేస్తున్న సమయంలో కూడా ఈయన రెండు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 4, 2020, 6:44 PM IST
నాగార్జున ఆ విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యాడా..?
నాగార్జున (Instagram/Photo)
  • Share this:
నాగార్జున ఒకప్పుడు వరస సినిమాలు చేసాడు.. ఏడాదికి రెండు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సీనియర్ హీరోలంతా ఒక్కటే చేస్తున్న సమయంలో కూడా ఈయన రెండు మూడేళ్ల కింది వరకు రెండు సినిమాలు చేసాడు. అయితే కొన్నేళ్లుగా నాగార్జునకు సరైన విజయం రాలేదు. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత వచ్చిన ఊపిరి పర్లేదనిపించింది.. ఆ తర్వాత ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు 2 లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈయన బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు. సోలోమెన్ దర్శకుడు.. ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నాడు ఈయన.

నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ వాయిదా (Twitter/nagarjuna wild dog)
నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ వాయిదా (Twitter/nagarjuna wild dog)


గతంలో ఆయనతో ఉన్న పరిచయం కారణంగానే చెప్పిన కథ నచ్చి అవకాశం ఇచ్చాడు నాగార్జున. అయితే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సినిమాతో పాటు హిందీలో బ్రహ్మస్త్ర సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు నాగార్జున. అందులో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. వైల్డ్ డాగ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. అందులో పాటలుండవు.. పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా. దాంతో అభిమానులు ఆయన్ని చూడాలనుకుంటున్నట్లు ఇప్పుడు కుదరడం లేదు. పైగా ఆయన వింటున్న కథల్లో ఒక్కటి కూడా నచ్చడం లేదని తెలుస్తుంది.

బ్రహ్మస్త్ర సినిమా స్టిల్ (nagarjuna brahmastra)
బ్రహ్మస్త్ర సినిమా స్టిల్ (nagarjuna brahmastra)


మన్మథుడు 2 తర్వాత దాదాపు 50 కథలు వింటే ఒక్కటి కూడా మనసుకు నచ్చలేదని తెలుస్తుంది. నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తున్నాడు నాగార్జున. ప్రస్తుతం బంగార్రాజు కథను కూడా మళ్లీ మెరుగులు దిద్దాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు సూచించాడు నాగార్జున. మొత్తానికి వస్తే సాలిడ్ సినిమాతో రావాలని చూస్తున్నాడు. అందుకే 2020ని వదిలేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తున్న నాగార్జున అభిమానులకు మాత్రం ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. కానీ కమ్ బ్యాక్ మాత్రం స్ట్రాంగ్‌గా ఇవ్వాలని చూస్తున్నాడు ఈయన.
Published by: Praveen Kumar Vadla
First published: July 4, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading