NAGARJUNA AKKINENI CLARITY ABOUT HIS NEXT PROJECT BANGARRAJU HERE ARE THE DETAILS TA
Nagarjuna: ఆ విషయంలో అభిమానులకు నాగార్జున క్లారిటీ.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..
నాగార్జున అక్కినేని (File/Photo)
Nagarjuna: అక్కినేని నాగార్జునకు గత కొంత కాలంగా ఏది కలిసి రావడం లేదు. సినిమాలకు టాక్ బాగున్నా.. కలెక్షన్లు మాత్రం రావడం లేదు. తాజాగా నాగార్జున ఓ విషయంలో అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఒకటే ఖుషీ అవుతున్నారు.
Nagarjuna: అక్కినేని నాగార్జునకు గత కొంత కాలంగా ఏది కలిసి రావడం లేదు. సినిమాలకు టాక్ బాగున్నా.. కలెక్షన్లు మాత్రం రావడం లేదు. రీసెంట్గా నాగార్జున ముఖ్యపాత్రలో నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా.. ఆ స్థాయిలో మాత్రం కలెక్షన్లు తెచ్చుకోలేక డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మాత్రం సూపర్ హిట్ అనిపించుకుంది. తాజాగా నాగార్జున.. కోవిడ్ వాక్సినేషన్‌కు సంబంధించి రెండో డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా డోసు తీసుకోవాలన్నారు. అపుడే ఈ మహామ్మారిని అదుపు చేయగలమన్నారు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్‌ను తాత్కాలింగా రద్దు చేసారు.
ఈ సినిమా హిందీలో హిట్టైయిన ‘రెయిడ్’ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు.ఈ సినిమాలో నాగార్జున మాజీ ‘రా’ అధికారి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. కరోనా సెకండ్ తగ్గిన తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ లోపు జూలైలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ (Twitter/Photo)
ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్ని ఓ కొలిక్కి వచ్చాయట. తొందర్లనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. ఈ సినిమాను జూలైలో స్టార్ట్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. మరోవైపు నాగార్జున.. హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ లో తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసాడు. మరోవైపు ధనుశ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవతో ఓ సినిమా కూడా ఉంది. . మొత్తంగా నాగార్జున వరస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.