Nagarjuna: హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. అంతేకాదు నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఇప్పటికిీ మరిచిపోయారు. అందువలన అదే టైటిల్‌తో.. ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను తెరకెక్కించబోతున్నట్టు నాగార్జునతో పాటు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా నాగార్జున మధ్యలో ఆపివేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ‘వైల్డ్ డాగ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున.. బంగార్రాజు సినిమా విషయంలో తన మనసులో మాట బయటపెట్టాడు.
ఈ సినిమాను జూన్‌లో మొదలు పెట్టి.. సంక్రాంతి బరిలో విడుదల చేయనున్నట్టు నాగార్జున చెప్పాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్ని ఓ కొలిక్కి వచ్చాయట. తొందర్లనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు ఇతర వివరాలు వెల్లడించనున్నారు.ఇక నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిందీలో హిట్టైయిన ‘రెయిడ్’ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ లోపు కంప్లీట్ అవుతోందట. మరోవైపు నాగార్జున.. హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ లో తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసాడు. మరోవైపు ధనుశ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవతో ఓ సినిమా కూడా ఉంది. . మొత్తంగా నాగార్జున వరస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.