Sardar Pre Release Event : కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. ఓ రకంగా చెప్పాలంటే అన్న కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్ సొంతం చేసుకున్నాడు కార్తి. ఆయన సినిమాలు ఒకప్పుడు వరస విజయాలను కూడా అందుకున్నాయి. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలతో తెలుగులో కార్తి ఇమేజ్ భారీగానే పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన దొంగ, సుల్తాన్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఈయన హీరోగా నటించిన ఖైదీ విషయానికొస్తే.. ఈ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు కార్తి. ఈ సినిమా తెలుగులో కూడా సంచలన విజయం సాధించింది.
తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఖైదీ. దానికి ముందు ఖాకీ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. కెరీర్ పరంగా మంచి హైట్స్‌లో ఉన్నాడు ఈయన. రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్ -1’ PS -1 చిత్రంలో విక్రమ్, జయం రవి, శరత్ కుమార్ వంటి హీరోలున్న తన నటనతోనే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ 19/10/2022 హైదరాబాద్‌లో దసపల్లా హోటల్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. గతంలో కార్తితో ‘ఊపిరి’ సినిమా చేసారు. ఆ చనువుతోనే ఇపుడు కార్తి నటించిన ‘సర్ధార్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక నాగార్జున నటించిన ‘చినబాబు’ టైటిల్‌తో కార్తి ఓ సినిమా కూడా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ’సర్ధార్’ సినిమా టైటిల్ గతంలో దివంగత కృష్ణంరాజు నటించిన సినిమా కూడా ఉంది. మొత్తంగా పాత సినిమా టైటిల్స్‌తో కార్తి తెలుగు ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్నాడు.
Get Ready to welcome Team #Sardar to our very own #Hyderabad for the Grand Pre-Release Event on 19th Oct, 4PM????
King @iamnagarjuna as chief guest???? ????Daspalla Convention, 1st Floor, HYD ????️https://t.co/isary6syL3@Karthi_Offl @RaashiKhanna_ @rajishavijayan @Psmithran pic.twitter.com/QwXm2WnmD3 — BA Raju's Team (@baraju_SuperHit) October 18, 2022
‘సర్ధార్’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది. . ఈ చిత్రంలో కార్తి తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేసారు. ఇందులో చంద్రబోస్ (సర్ధార్) పాత్రలో కనిపించనున్నారు. ఎక్స్ రా ఆఫీసర్ పాత్రలో కనిపంచనున్నారు . రెండోది సర్ధార్ కొడుకు ఇన్స్పెక్టర్ విజయ ప్రకాష్ పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో కార్తి సరసన రాశీ ఖన్నా..రజిషా విజయన్ హీరోయిన్ పాత్రల్లో కనిపంచనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthi, Nagarjuna Akkineni, Sardar