నాగార్జున తనను మోసం చేసాడంటున్న ఆ హీరోయిన్..

Nagarjuna Akkineni: నాగార్జున అంటే ఎవరో కాదు.. హీరో నాగార్జునే.. ఇప్పుడు తనను మోసం చేసాడంటూ ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. అసలు ఇది విన్న తర్వాత అభిమానులు కూడా కంగారు పడుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2020, 3:44 PM IST
నాగార్జున తనను మోసం చేసాడంటున్న ఆ హీరోయిన్..
నాగార్జున అక్కినేని (Instagram/Photo)
  • Share this:
నాగార్జున అంటే ఎవరో కాదు.. హీరో నాగార్జునే.. ఇప్పుడు తనను మోసం చేసాడంటూ ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. అసలు ఇది విన్న తర్వాత అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అసలు నాగార్జున ఏంటి.. మోసం చేయడమేంటి ఏం మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న కథ కూడా ఉంది. నాగ్‌పై ఇలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ఎవరో కాదు ఆనందం సినిమాతో పరిచయమైన రేఖ. అప్పట్లో ఈమె తెలుగులో బాగానే నటించింది. వరసగా సినిమాలు కూడా చేసింది. అయితే సినిమాలు చేసినంత ఈజీగా విజయాలు మాత్రం రాలేదు. ఆనందం తర్వాత శ్రీనువైట్ల హీరోయిన్‌గానే చాలా రోజుల పాటు గుర్తింపు కంటిన్యూ చేసింది ఈమె.
ఆనందం రేఖ నాగార్జున (rekha nagarjuna)
ఆనందం రేఖ నాగార్జున (rekha nagarjuna)


2001లో విడుదలైన ఆనందం సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో హీరో ఆకాష్, రేఖ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. తిట్టుకుంటూనే ప్రేమలో పడిపోయే పాత్రల్లో వాళ్ళు అద్భుతంగా నటించారు. కామెడీతో పాటు అదిరిపోయే ఎమోషన్ కూడా ఆ సినిమాలో బాగానే వర్కవుట్ అయింది. ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, నిన్న నేడు రేపు లాంటి చాలా సినిమాలు చేసింది రేఖ. అలాంటి సమయంలోనే నాగార్జున, విజయ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన మన్మథుడు సినిమాలో రేఖకు ఓ అతిథి పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్. అయితే ఆ చిత్రం చేస్తున్న సమయంలోనే నాగార్జున తనకు మరో సినిమా అవకాశం ఇస్తానని మాటిచ్చినట్లు చెప్పింది ఈమె.
ఆనందం రేఖ నాగార్జున (rekha nagarjuna)
ఆనందం రేఖ నాగార్జున (rekha nagarjuna)

ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ అవకాశం మాత్రం ఇప్పటికీ రాలేదని.. వస్తుందేమో అనే ఆశతో చాలా ఏళ్లు ఉన్నానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఎన్నేళ్లు వేచి చూసినా కూడా అది నిజం కాలేదని చెప్పింది రేఖ. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా కొన్నేళ్ల పాటు సినిమాలు చేసింది. ప్రస్తుతం ముంబైలో ఉంటుంది రేఖ. ఈ మధ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో కనిపించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది ఈమె. అప్పట్లో ఓసారి బ్రతికున్న తనని మీడియా చంపేసిందని కూడా సంచలన విషయాలు వెల్లడించింది. ఏదేమైనా కూడా నాగార్జున తనకు ఇచ్చిన ఆపర్ గురించి ఇప్పుడు చెప్పడం వెనక ఆంతర్యమేంటో మరి..?
Published by: Praveen Kumar Vadla
First published: February 20, 2020, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading