Nagarjuna: ‘హలో బ్రదర్’ మూవీలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఇతనే..

Nagarjuna Akkineni Helo Brother Movie | నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’కు ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో నటించాడు.ఈ చిత్రంలో నాగార్జున డూప్‌గా నటించింది ఎవరంటే..

news18-telugu
Updated: November 28, 2020, 7:37 AM IST
Nagarjuna: ‘హలో బ్రదర్’ మూవీలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఇతనే..
నాగార్జున (File/Photo)
  • Share this:
Nagarjuna Akkineni Helo Brother Movie | నాగార్జున సినీ కెరీర్‌లో ‘హలో బ్రదర్’ చిత్రానికి  ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో బిగ్‌బాస్ షో వేదికగా నాగార్జున ఈ సినిమాలో తన డూప్‌గా ఎవరు నటించారానే విషయమై ఈ షోలో వెల్లడించాడు. ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున రెండు సీన్లలో కనిపించే సన్నివేశాల్లో హీరో శ్రీకాంత్ తనకు డూప్‌గా నటించినట్టు నాగార్జున ఆ షోలో వెల్లడించాడు. ఇక హీరోగా శ్రీకాంత్‌కు ఇ.వి.వి. సత్యనారాయణతో మంచి అనుబంధం ఉంది. అంతకు ముందు శ్రీకాంత్ ఇ.వి.వి.సత్యనారాయణ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ‘వారసుడు’ సినిమాలో నటించాడు. ఆ అనుబంధంతోనే నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’లో నాగార్జున.. ఇద్దరుగా కనిపించే సన్నివేశాల్లో ఆయనకు డూప్‌గా  నటించాడు శ్రీకాంత్. ఇద్దరి హైట్‌తో పాటు పర్సనాలిటీ ఒకే రకంగా ఉండటంతో ఇ.వివి.సత్యనారాయణ.. శ్రీకాంత్‌ను నాగార్జున డూప్‌గా ‘హలో బ్రదర్’ సినిమాలో నటింపచేసాడు. హీరో శ్రీకాంత్.. నాగార్జున హీరోగా నటించిన ‘వారసుడు’ సినిమాతో పాటు ప్రెసిడెంట్ గారి పెళ్లాం, నిన్నే ప్రేమిస్తా వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 28, 2020, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading