HOME »NEWS »MOVIE »nagarjuna akkineni best wishes to his daughter in law samantha naga naga chaitanya ta

Nagarjuna-Samantha: కోడలు సమంత చేస్తోన్న పనికి మామ నాగార్జున ఫిదా..

Nagarjuna-Samantha: కోడలు సమంత చేస్తోన్న పనికి మామ నాగార్జున ఫిదా..
నాగార్జున,సమంత (File/Photo)

Nagarjuna-Samantha | అక్కినేని కోడలు సమంత చేసిన పనికి నాగార్జున బెస్ట్ విషెస్ తెలియజేసాడు. 

  • Share this:
    Nagarjuna-Samantha | అక్కినేని కోడలు సమంత చేసిన పనికి నాగార్జున బెస్ట్ విషెస్ తెలియజేసాడు. అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత సమంత దూకుడు మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు..మరోవైపు కుటుంబానికి తగినంత ప్రాధ్యానత ఇస్తూనే తనదైన శైలిలో దూసుకుపోతుంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత  సక్సెస్ రేటు కూడా పెరిగింది. గతేడాది  భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో సక్సెస్ అందుకుంది సమంత. ఆ తర్వాత ‘ఓ బేబి’ తో సోలో హిట్టును తన అకౌంట్‌లో వేసుకుంది. ఈ రకంగా అక్కినేని హీరోలు సక్సెస్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే.. సమంత మాత్రం హిట్స్ మీద హిట్స్ అందుకుంటుంది. మరోవైపు తన స్నేహితురాల్లతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓ ప్రీ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది. తాజాగా సమంత వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది.


    తాజాగా సమంత అక్కినేని తన పేరు కలిసొచ్చేలా ‘సాకీ’ పేరుతో మహిళల  బ్రాండెడ్ ఫ్యాషన్ వస్త్రాలను లాంచ్ చేసింది. అంతేకాదు ఈ బ్రాండ్‌ను సమంత ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది. కొత్తగా కనిపించాలని అందరికీ ఉంటుంది. దానికి సరైన వేదిక ‘సాకీ’ బ్రాండ్ అంటూ సమంత చేస్తోన్న ప్రచారం అభిమానులతో పాటు మాములు జనాల్లోకి బాగానే వెళ్లింది. ఈ రోజు ఉదయం 9 గంటల 35 నిమిషాలకు ఈ బ్రాండ్‌ను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సమంత. ఇక సమంత ప్రారంభించిన కొత్త వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని కోరకుంటూ.. కోడలకు బెస్ట్ విషెస్ తెలియజేసాడు. కొత్తగా మొదలుపెట్టిన ఈ వ్యాపారంలో నువ్వు తప్పక రాణిస్తావు అంటూ విషెస్ అందించాడు. ఈ సందర్భంగా తనకు బెస్ట్ విషెస్ తెలియజేసిన నాగార్జునకు థాంక్యూ మామ అంటూ రిప్లై ఇచ్చింది.


    ఈ సందర్భంగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన సమంత, నాగ చైతన్యకు అభిమానులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:September 28, 2020, 13:07 IST