హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna: నాగార్జున ‘బంగార్రాజు’కు ముహూర్తం ఖరారు.. మరోసారి ఆ పాత్రలో అదరగొట్టనున్న కింగ్..

Nagarjuna: నాగార్జున ‘బంగార్రాజు’కు ముహూర్తం ఖరారు.. మరోసారి ఆ పాత్రలో అదరగొట్టనున్న కింగ్..

అక్కినేని నాగార్జున (పాత చిత్రం)

అక్కినేని నాగార్జున (పాత చిత్రం)

Nagarjuna: అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

Nagarjuna: అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  వివరాల్లోకి వెళితే.. నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందని ద్రాక్షనే అయింది. అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు నాగార్జున. ఈ ప్రీక్వెల్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై నాగార్జున ‘వైల్డ్ డాగ్’ (Wild Dog) ప్రమోషన్‌లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో నటించే నటీనటుల డేట్స్‌ను మళ్లీ రీ షెడ్యూల్ చేసారు.

ఇక ఈ సినిమాను నాగార్జునఈ నెల 20న పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈ సినిమ ా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. అక్కడే ఈ నెల 20 నుంచి నాగార్జున, రమ్యకృష్ణలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మరో హీరోగా నాగ చైతన్య యాక్ట్ చేస్తున్నారు. మనం తర్వాత వీళ్లిద్దరు కలిసి ఈ సినిమా నటిస్తుండంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తుందట. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ‘రాధే శ్యామ్’, పవన్, రానా మూవీతో పాటు, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ సినిమాలున్నాయి. ఇపుడు నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ కూడా విడుదలకు ఉరకలు వేస్తున్నట్టు తెలుస్తోంది.

Tollywood Family Multistares Nagarjuna Akkineni Naga Chaitanya done Multistarer Movie Bagarraju Here Are The Details,Tollywood Family Multistares: ‘బంగార్రాజు’ కోసం మరోసారి సిల్వర్ స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్..,Tollywood Family Multistares,Nagarjuna Akkineni Naga Chaitanya Multistarer,Chiranjeevi ram charan acharya,Tollywood Family Multistarers,chiranjeevi,ram charan,acharya,megastar chiranjeevi,mega family heroes,venky mama moview review,venkatesh naga chaitanya venky mama,naga chaitanya nagarjuna anr,nandamuri family,balakrishna ntr,Ghattamaneni family,mahesh babu krishna,krishnam raju,prabhas,pawan kalyan,tollywood,telugu cinema,వెంకీమామ,వెంకీ మామ మూవీ రివ్యూ,వెంకటేష్ నాగ చైతన్య,నాగ చైతన్య నాగార్జున ఏఎన్నార్,కృష్ణ మహేష్ బాబు,ఘట్టమనేని ఫ్యామిలీ,అక్కినేని ఫ్యామిలీ,దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ,బాలకృష్ణ ఎన్టీఆర్,మెగా ఫ్యామిలీ,కొణిదెల ఫ్యామిలీ,చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్,ఆచార్య రామ్ చరణ్ చిరంజీవి,టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీస్,నాగార్జున నాగ చైతన్య మల్టీస్టారర్ మూవీ,నాగార్జున నాగ చైతన్య బంగార్రాజు సీక్వెల్
నాగార్జున, నాగ చైతన్య (Twitter/Photo)

‘సోగ్గాడే చిన్నినాయనా’ విషయానికొస్తే.. హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. అంతేకాదు నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  ఈ చిత్రంలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఇప్పటికిీ మరిచిపోలేదు. . ఈ సినిమాలో నాగార్జున అమాయకుడైన పాత్రతో చిలిపి తాతగా అలరించనున్నారు.

’సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున (Twitter/Photo)

ఇక నాగార్జున ఇతర సినిమాల  విషయానికొస్తే.. ఈ యేడాది  ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్‌లో రాలేదు. ఓటీటీలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిందీలో హిట్టైయిన ఓ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున ’రా’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. జబర్ధస్త్ యాంకర్ రష్మి గౌతమ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది.  మరోవైపు నాగార్జున.. హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ లో తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసారు. మరోవైపు ధనుశ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవతో ఓ సినిమా కూడా ఉంది. మొత్తంగా నాగార్జున వరస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

First published:

Tags: Bangarraju, Kalyan Krishna, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Tollywood

ఉత్తమ కథలు