కత్రినా కైఫ్ పెళ్లి ఫోటోలు వైరల్.. నాగార్జున, అమితాబ్ చేతుల మీదుగా..

అదేంటి.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లా..? ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగింది.. ఇంతకీ ఎవరితో జరిగింది అనుకుంటున్నారా..? జరిగింది.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 24, 2020, 2:04 PM IST
కత్రినా కైఫ్ పెళ్లి ఫోటోలు వైరల్.. నాగార్జున, అమితాబ్ చేతుల మీదుగా..
కత్రినా కైఫ్ మ్యారేజ్ యాడ్
  • Share this:
అదేంటి.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లా..? ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగింది.. ఇంతకీ ఎవరితో జరిగింది అనుకుంటున్నారా..? జరిగింది.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ఇండియన్ సినిమా నుంచి దిగ్గజాలు హాజరయ్యారు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. నాగార్జున, ప్రభు, శివరాజకుమార్ సహా అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యాడు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. వీటిని షేర్ చేసింది కూడా నాగార్జుననే. అయితే ఇదంతా నిజం పెళ్లి మాత్రం కాదు.. నగల దుకాణం ప్రమోషన్ కోసం తీసిన యాడ్‌లో కత్రిన పెళ్లి కూతురిగా నటించింది.

అందులో నాగార్జునతో పాటు పలువురు సూపర్ స్టార్స్ కనిపించారు. అందులో కత్రిన పెళ్లి కూతురిగా కనిపించగా.. అమితాబ్, జయా బచ్చన్ ఆమె తల్లిదండ్రులుగా నటించారు. ఇక నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్ ఆ పెళ్లికి వచ్చిన అతిథులుగా నటించారు. ఈ యాడ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోను అమితాబ్ షేర్ చేసి ఇండియన్ లెజెండరీ నటుల వారసులతో కనిపించడం ఆనందంగా ఉందని తెలిపాడు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున.. తమిళ పరిశ్రమకు చెందిన శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు.. కన్నడం నుంచి రాజ్‌ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌లతో ఈ యాడ్‌లో కలిసి నటించాడు అమితాబ్ బచ్చన్. మొత్తానికి కత్రినా పెళ్లి ఫోటోలు మాత్రం బాగానే వైరల్ అయ్యాయి.
Published by: Praveen Kumar Vadla
First published: January 24, 2020, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading