హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna OTT: ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున.. అక్కడ చేయలేనివి ఇక్కడ చేయాలని..!

Nagarjuna OTT: ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున.. అక్కడ చేయలేనివి ఇక్కడ చేయాలని..!

నాగార్జున (File/Photo)

నాగార్జున (File/Photo)

Nagarjuna OTT: తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో నాగార్జున(Nagarjuna). కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన థియేటర్స్ కాకుండా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే ఓటిటి నాగ్ అయిపోతున్నాడు.

ఇంకా చదవండి ...

తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో నాగార్జున. ఇప్పుడు కాదు.. కెరీర్ మొదట్నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ మాదిరే సాహసమే ఈయన ఊపిరి. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు నాగార్జున. అందుకే ఈయన పరిచయం చేసినంత మంది దర్శకులకు మరే హీరో కూడా ఈ తరంలో పరిచయం చేయలేదు. 30 మందికి పైగా దర్శకులకు లైఫ్ ఇచ్చాడు మన్మథుడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నాగార్జున. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఈ మధ్యే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగ్. ఈ చిత్రంతో అహిషోర్ సోలోమెన్ అనే దర్శకుడిని పరిచయం చేసాడు ఈయన. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు లాంటి టాలెంటెడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు ఈయన. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. ఇందులో స్పై కారెక్టర్ చేస్తున్నాడు నాగార్జున. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది ఈ చిత్రంలో. ఈమె పాత్ర వేశ్యతో పాటు స్పై మాదిరి ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నాగార్జున. ఈ మధ్య చాలా మంది హీరోలు డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో సమంత, కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే ఓటిటిలోకి వచ్చేసారు. హీరోలు మాత్రం స్టార్స్ ఎవరూ రాలేదు.. ఇప్పుడు నాగార్జున వచ్చేస్తున్నాడు. సత్యదేవ్ లాంటి హీరోలు ఇప్పటికే వెబ్ సిరీస్‌లతో ఓటిటిలో రచ్చ చేస్తున్నారు. నాగార్జున ఇప్పుడు తనవంతుగా ఓటిటి సినిమా చేయబోతున్నాడు.

nagarjuna,nagarjuna twitter,nagarjuna instagram,nagarjuna movies,nagarjuna ott entry,nagarjuna ott web movie,nagarjuna web movie for ott,nagarjuna praveen sattaru movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ఓటిటి సినిమా,నాగార్జున ఓటిటి ఎంట్రీ
నాగార్జున (File/Photo)

ఈ సీనియర్ హీరోకి ఓ దర్శకుడు చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చడంతో ఓటీటీలోనే చేయాలని చూస్తున్నాడు. అందుకే త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలిపాడు నాగార్జున. ఓ ఐడియా అనుకున్నామని.. బాగా నచ్చిందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పాడు ఈయన. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఓటిటిలో విడుదల అవుతుందని చెప్పాడు నాగ్. నిజానికి 'వైల్డ్ డాగ్' సినిమాతోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ చివరి నిమిషంలో దానిని థియేటర్‌లలో విడుదల చేశారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akkineni nagarjuna, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు