Nagarjuna Akkineni Akhil |అక్కినేని నాగార్జున నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన అఖిల్.. ఇప్పటి వరకు హీరోగా హిట్ మొఖం చూడలేదు. చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అక్కినేని హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత అఖిల్.. సురేందర్ రెడ్డితో ఓ యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత అఖిల్.. తన తండ్రి నాగార్జునతో ఓ ఎంటర్టేనర్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగార్జున కూడా వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు.

నాగార్జున అక్కినేని, అఖిల్ (File/Photo)
ఓ వైపు ‘వైల్డ్ డాగ్’ మూవీతో పాటు మరోవైపు సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్.. బంగర్రాజుతో పాటు ప్రవీణ్ సత్తారు, యాత్ర ఫేమ్ మహి వి రాఘవతో సినిమాలతో పాటు ధనుశ్‌తో ఓ మల్టీస్టారర్‌తో పాటు బ్రహ్మాస్త్ర’ అనే హిందీ మూవీ చేయనున్నాడు. తాజాగా నాగార్జున.. తన తనయుడు అఖిల్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్టు సమాచారం.నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కేబోయే ఈ చిత్రాన్ని టాలీవుడ్లో వరుస హిట్లతో దూకుడు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

నాగార్జున అక్కినేని, అఖిల్, అనిల్ రావిపూడి (File/Photo)
ఇప్పటికే అనిల్ రావిపూడి.. నాగార్జున, అఖిల్‌ను కలిసి ఓ స్టోరీ వినిపించాడట. ముందుగా అఖిల్ కోసమే ఈ స్టోరీ రెడీ చేయగా.. నాగార్జున సూచనలతో ఈ సినిమా కాస్తా మల్టీస్టారర్‌గా కథను రెడీ చేసినట్టు సమాచారం. నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కనే ఈ చిత్రం అప్పట్లో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’, ‘ప్రెసిడెంటు గారి పెళ్లాం’ సీక్వెల్ తరహాలో ఉంటుందని చెబుతున్నారు.

నాగార్జున అక్కినేని, అఖిల్ (File/Photo)
ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా అలరించిన అఖిల్.. ఇపుడు పూర్తిస్థాయి ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీతో తండ్రి నాగార్జునతో పూర్తి స్థాయిలో కలిసి నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తొలి సినిమా తరువాత అనిల్ రావిపూడి వరసగా దిల్ రాజు బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇపుడు నాగార్జున, అఖిల్‌లతో చేయబోయే సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నాడు. ఈ సినిమా విషయమై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:November 15, 2020, 14:49 IST