నాగార్జునను భయపెట్టిన బాలకృష్ణ..

గత కొన్నిరోజులుగా నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుంది. నందమూరి బాలకృష్ణను చూసి ఇపుడు నాగార్జున భయపడటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నాగ్..బాలయ్యను చూసి నిజంగానే భయపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 22, 2020, 10:33 AM IST
నాగార్జునను భయపెట్టిన బాలకృష్ణ..
బాలకృష్ణ,నాగార్జున (Facebook/Photo)
  • Share this:
గత కొన్నిరోజులుగా నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుంది. నందమూరి బాలకృష్ణను చూసి ఇపుడు నాగార్జున భయపడటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నాగ్..బాలయ్యను చూసి నిజంగానే భయపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. గతేడాది మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలయ్య తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో  ఎన్టీఆర్ నట ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా సాఫీగా సాగడం, పైగా ఒకే సినిమాగా తెరకెక్కించాల్సిన బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించడం వంటివి ఈ సినిమా పరాజయానికి కారణాలుగా నిలిచాయి.మహానటుడు జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ సినిమానే ప్రేక్షకులు తిరస్కరించడంతో ..నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జీవితంపై తెరకెక్కించాలనుకున్న బయోపిక్‌ను ఆపేసినట్టు ఆ మధ్యనే ఒక మూవీ ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున చెప్పుకొచ్చాడు. అంతేకాదు అప్పట్లో అక్కినేని నటించిన సినిమాలనే రీమేక్ చేయడానికి భయపడే నేను..ఆయన బయోపిక్ తీసే సాహసం చేయలేని చెప్పి బాలకృష్ణకు ఇన్‌ డైరెక్ట్‌గా చురకలు అంటించాడు.

మహానటుడు ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు (Twitter/photos)


ఆ మధ్య అక్కినేని బయోపిక్‌పై వస్తోన్న వార్తలను ఖండించిన నాగార్జున..ఆ తర్వాత వాళ్ల నాన్నగారైన  ఏఎన్నాఆర్ బయోపిక్ తీయాలని ఫిక్స్ అయ్యాడు నాగ్. తీరా ‘ఎన్టీఆర్’ బయోపిక్’ ఫ్లాప్ అయ్యే సరికి తన తండ్రి జీవితంపై తీయాలనుకున్న బయోపిక్‌ ఆలోచనలకు పులిస్టాప్ పెట్టేసాడు నాగార్జున.

వార‌సులే ఎన్టీఆర్ బ‌యోపిక్ బ‌ల‌మా..? balakrishna,sumanth main strength for ntr biopic..
ఏఎన్నార్ పాత్రలో నటించిన సుమంత్ (Twitter/photo)
మొత్తానికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు అయిన పరాభవం తన తండ్రి జీవితంపై తీసే సినిమాకు కావద్దనే ఉద్దేశ్యంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి బాలయ్య తీసిన ఎన్టీఆర్ బయోపిక్...నాగార్జునను తన తండ్రి బయోపిక్ తెరకెక్కించకుండా భయపెట్టిందనే చెప్పాలి.

మహానటిలో తాత పాత్రలో నటించిన నాగ చైతన్య (Twitter/Photo)


కొసమెరుపు ఏమిటంటే.. ఏఎన్నార్ బయోపిక్ తెరకెక్కకపోయినా... ‘మహానటి’తో పాటు ‘ఎన్టీఆర్’ బయోపిక్స్‌లో అక్కినేని పాత్రలు ఉండటం.. ఆయా పాత్రలను అక్కినేని మనవళ్లైన  నాగ చైతన్య మహానటిలో తాత పాత్రలో  కనిపిస్తే.. ‘ఎన్టీఆర్’ జీవితంపై తెరకెక్కిన బయోపిక్‌లో సుమంత్ తాత ఏఎన్నార్ పాత్రలో నటించడం విశేషం. 
First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు