Home /News /movies /

NAGARJUNA ACCEPTED GARUDA VEGA DIRECTOR PRAVEEN SATTARU HERE ARE THE DETAILS TA

క్రేజీ డైరెక్టర్ మూవీకి ఓకే చెప్పిన నాగార్జున..

నాగార్జున:

నాగార్జున:

నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా నాగార్జున మరో క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం.

    నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాగార్జున సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ముందుగా అనుకున్న ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను థాయిలాండ్‌లో పిక్చరైజ్ చేయాలి. కానీ కరోనా కారణంగా అక్కడ షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాతో  పాటు నాగార్జున హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకోవైపు ధనుశ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ఈ సినిమా  మళ్లీ పట్టాలెక్కనుంది. బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విషయానికొస్తే.. ఇందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్ర చేస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో నాగ్ పాత్ర షూటింగ్ పూర్తైపోయింది. తాజాగా నాగార్జున మరో క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం.

    nagarjuna accepted garuda vega director praveen sattaru here are the details,Nagarjuna Akkineni,nagarjuna,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ
    ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున (File/Photos)


    సీనియర్ హీరో రాజశేఖర్‌కు ‘గరుడ వేగ’ వంటి సూపర్ హిట్ అందించడంతో పాటు వెరైటీ సబ్జెక్ట్‌తో ఆకట్టుకున్నాడు ప్రవీణ్ సత్తారు. తాజాగా ఈయన  నాగార్జున ఇమేజ్‌కు తగ్గ ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని నేరేట్ చేసినట్టు సమాచారం. ఈ స్టోరీ విని నాగ్ కూడా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇక ప్రవీణ్ సత్తారు.. ’గరుడ వేగ’ తర్వాత రామ్ పోతినేనితో ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ బడ్జెట్ ఎక్కువ కావడంతో ఈ సినిమా పట్టాలెక్కపోయింది. మరి ఇపుడు నాగార్జునతో చేయబోతున్న సినిమాతోనైనా.. ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా మరోసారి తన మార్క్ చూపిస్తాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Nagarjuna Akkineni, Praveen Sattaru, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు