Bangarraju Streaming | Zee5 : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 18 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్స్‌లో చూసిన అక్కినేని ఫ్యాన్స్ మరోసారి ఓటీటీ వేదికగా చూస్తున్నారు. ఇక థియేటర్స్ లో ఈ సినిమా చూడని వాళ్లు కూడా ఈ సినిమాను ఓటీటీ వేదికగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ‘బంగార్రాజు’ వసూళ్ల విషయానికి వస్తే.. ఈ సినిమా 2022లో మన దేశంలో ఫస్ట్ హిట్ అందుకున్న సినిమాగా ‘బంగార్రాజు’ సినిమా రికార్డులకు ఎక్కింది. కరోనా థర్ట్ వేవ్‌లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది.
నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే స్టోరీ కూడా బాగుండటంతో ఈ సినిమా పంట పండింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా తాజాగా ఈ సినిమాను 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్టు జీ5 ప్రకటించింది.
#Bangarraju Most Loved by Audience 500 Million+ Streaming Minutes on #ZEE5. Have you watched it yet? Go #WatchNow streaming exclusively on ZEE5.
▶️ https://t.co/lxnCR0qVFQ#WatchNow #BangarrajuOnZEE5 #VaasivaadiTassadiyya @iamnagarjuna @chay_akkineni @meramyakrishnan pic.twitter.com/NLNpmOsKtT — ZEE5 Telugu (@ZEE5Telugu) February 26, 2022
కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.ఇక ‘బంగార్రాజు’ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్‌కు గాను ఇప్పటి వరకు రూ. 40 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 2022లో మొదటి విజయంగా నిలిచింది. అయితే నైజాంలో మాత్రం 2.5 కోట్లు వెనకబడి ఉంది బంగార్రాజు. ఇక్కడ 11.50 కోట్ల బిజినెస్ చేస్తే వచ్చింది 9 కోట్లు మాత్రమే. అయితే ఏపీలో మాత్రం ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాలలో లాభాలు వచ్చాయి. ఓవర్సీస్ కూడా బంగార్రాజు సేఫ్ కాలేదు. ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్యలలు తండ్రీ కొడుకులుగా.. తాత మనవళ్లుగా నటించారు. ఈ సినిమాలో నాగార్జున.. తండ్రీ తనయులుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.