• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGACHAITANYA IS FLATTERED WHO IS DOING AN ADVENTURE WITH A GENRE THAT HAS NOT BEEN TOUCHED IN MOVIES MHN

Akkineni Naga Chaitanya: సినిమాల్లో టచ్‌ చేయని జోనర్‌తో సాహసం చేస్తున్న నాగచైతన్య.. మెప్పిస్తాడా?

Akkineni Naga Chaitanya: సినిమాల్లో టచ్‌ చేయని జోనర్‌తో సాహసం చేస్తున్న నాగచైతన్య.. మెప్పిస్తాడా?

Nagachaitanya is flattered who is doing an adventure with a genre that has not been touched in movies

Akkineni Naga Chaitanya: నాగార్జున తనయుడు.. నట వారసుడు అయిన నాగచైతన్య డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చైతన్య టచ్‌ చేయని జోనర్‌లో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది.

  • Share this:
    ట్రెండ్ మారుతుంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా హీరోలు, హీరోయిన్స్‌ తమ పంథాను మార్చేస్తున్నారు. సినిమా రంగంతో పాటు డిజిటల్‌ రంగం కూడా డెవలప్‌ అవుతుంది. ఓటీటీలు, ఏటీటీలు ప్రేక్షకులను డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన హీరోలు, హీరోయిన్స్‌, స్టార్‌ టెక్నీషియన్స్‌ ఓటీటీ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆక్టటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోకి టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున తనయుడు.. నట వారసుడు అయిన నాగచైతన్య డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు నాగచైతన్యతో మంచి అనుబంధం ఉన్న దర్శకుడు, మనం ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడట. ఆసక్తికరమైన విషయమేమంటే.. సినిమాల్లో ఇప్పటి వరకు నాగచైతన్య టచ్‌ చేయని జోనర్‌ అయిన థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుందని వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

    ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలోనే 'థాంక్యూ' అనే సినిమా చేస్తున్నాడు. 'మనం' సినిమా తర్వాత చైతన్య, విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వెబ్ సిరీస్‌ తెరకెక్కనుందట. ప్రముఖ డిజిటల్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనుంది. ఇదే కనుక నిజమైతే అక్కినేని హీరోల్లో డిజిటల్‌ రంగంలోకి అడుగు పెడుతున్న తొలి హీరో నాగచైతన్యనే అవుతాడు. ఈయన సతీమణి సమంత ది ఫ్యామిలీ మ్యాన్‌ 2లో టెర్రరిస్ట్‌ పాత్రలో నటించింది. అలాగే ఆహాలో సామ్‌ జామ్‌ టాక్‌షో కూడా చేసింది.

    ఇక సినిమాల విషయానికి వస్తే.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి నాగచైతన్య నటించిన చిత్రం 'లవ్‌స్టోరి' ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు విక్రమ్‌ కుమార్‌ తెరకెక్కిస్తోన్న 'థాంక్యూ' సెట్స్‌పై ఉంది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు