Home /News /movies /

NAGABABU VS MLA ROJA MEGA BROTHER NAGABABU AGAIN SERIES ON MLA ROJA HERE ARE THE DETAILS TA

Nagababu Vs MLA Roja: రోజాపై మరోసారి తనదైన శైలిలో పంచ్‌లు వేసిన నాగబాబు..

రోజా, నాగబాబు(File/Photo)

రోజా, నాగబాబు(File/Photo)

Nagababu Vs MLA Roja: రోజాపై మరోసారి తనదైన శైలిలో పంచ్‌లు వేసిన నాగబాబు.. వివరాల్లోకి వెళితే..

    Nagababu Vs MLA Roja: రోజాపై మరోసారి తనదైన శైలిలో పంచ్‌లు వేసిన నాగబాబు.. వివరాల్లోకి వెళితే.. రోజా, నాగబాబు జబర్ధస్త్ ప్రోగ్రామ్ ప్రారంభం అయినప్పటి నుంచి వీళ్లిద్దరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ వచ్చారు. రోజా కూడా వైసీపీలో కీలక నేతగా ఉంటూనే ఈ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరించింది. కానీ నాగబాబు మాత్రం.. నిర్మాతగా లాస్ కావడంతో సినిమాల్లో క్యారెక్టర్ నటుడిగా స్థిర పడ్డాడు. దాంతో పాటు జబర్ధస్త్ కామెడీ షోలో జడ్జ్‌గా ఉండాలంటూ మల్లెమాల వాళ్లు అపుడే నాగబాబును సంప్రదించడంతో వెంటనే ఈ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు. ఈ ప్రోగ్రామ్ ఐదారేళ్లుగా సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూనే ఉంది. కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోజా, నాగబాబు.. కొన్నాళ్లు ఈ ప్రోగ్రామ్‌కు విరామం ప్రకటించి ఇద్దరు రాజకీయ రంగంలో తలపడ్డారు. రోజా.. మాత్రం రెండోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె గెలిచి పార్టీ అధికారంలోకవి రావడంతో ఆమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. మరోవైపు నాగబాబు కూడా తమ్ముడు జనసేన పార్టీ తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

    2019 ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మళ్లీ రోజా, నాగబాబు జబర్ధస్త్ షో లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగబాబు.. మల్లెమాల వాళ్ల టీమ్‌తో వచ్చిన క్లాష్‌తో ఆ ప్రోగ్రామ్‌ నుంచి తప్పుకున్నారు. అదే సమయంలో వేరే ఛానెళ్లో ‘అదిరింది’ ప్రోగ్రామ్‌తో పాటు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఛానెల్‌ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాడు. ఈ సంగతి పక్కనపెడితే.. తాజాగా నాగబాబు అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిట్‌చాట్ చేసాడు. ఈ సందర్భంగా కొంత మంది ఫ్యాన్స్ జబర్ధస్త్‌ ప్రోగ్రామ్‌లో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు అన్న ప్రశ్నకు రోజా అంటూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఇది విని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేసారు. అందరు నాగబాబు జబర్తస్త్‌లో హైపర్ ఆదితో పాటు గెటప్ శ్రీను పేరు చెబుతారు అని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రోజా పేరు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి నాగబాబు పెద్ద రీజనే చెప్పాడు. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్స్ వేసే పంచ్‌లకు రోజా వేసే పంచ్ డైలాగులు అంటే తనకు ఇష్టమన్నాడు. మరోవైపు రాజకీయంగా మామధ్య బేధాభిప్రాయాలు ఉన్న.. వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని నాగబాబు చెప్పడం కొసమెరుపు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth comedy show, MLA Roja, Nagababu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు